టీయూ వీసీగా దాచేపల్లి రవీందర్ గుప్తా
ABN , First Publish Date - 2021-05-23T05:35:33+05:30 IST
జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా దాచేపల్లి రవీందర్ గుప్తా నియమితులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొ ఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేసిన ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయనను టీయూ వీసీగా నియమించింది.

ఫిజిక్స్ బోధనలో విశేష అనుభవం
పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తానని వెల్లడి
నిజామాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా దాచేపల్లి రవీందర్ గుప్తా నియమితులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొ ఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేసిన ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆయనను టీయూ వీసీగా నియమించింది. మూడేళ్ల పాటు ఆయన వీసీగా పనిచేయనున్నారు. రవీందర్ గుప్తా ఫిజిక్స్ బోధనలో ఉస్మానియా యూనివర్సిటీలో మూడు దశాబ్దాల పాటు పని చేశారు. పలు పరిశోధనలు చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా 1996లో యంగ్ సైంటిస్ట్ అవార్డు ను అందుకున్నారు. అమెరికా, జపాన్, ఇంగ్లాండ్‌తో పాటు వివిధ దేశాలలో పరిశోధన పత్రాలను సమర్పించారు. నానో టెక్నాలజీపై ఆయన పరిశోధనలు చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కు చెందిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌లో పీజీ, పీహెచ్‌డీ చేశారు. అదే విశ్వవిద్యాలయంలో 1989 లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఆ యన 1998లో అసోసియేట్ ప్రొఫెస ర్‌గా పదోన్నతి పొందారు. ఆయన కు 2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి వచ్చింది. 2020లో పదవి విరమ ణ చేశారు. తలెంగాణ విశ్వవిద్యా లయంలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని దాచేపల్లి రవీ ందర్ గుప్తా ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోర్సులను ఉపాధికి ఉప యోగపడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థుల కేరియర్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ వా రి భవిష్యత్తుకు ఉపయోగపడేవిధంగా ఉన్నత విద్యను అం దిస్తామని తెలిపారు. జాతీయ అర్హత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేవిధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. అధ్యా పకులు, ఉద్యోగులు, విద్యార్థులను సమన్వయం చేసుకుం టూ అకాడమిక్ క్యాలండర్‌కు అనుగుణంగా నడిపిస్తామని తెలిపారు.