ప్రజలు, పోలీసులూ సమానమే
ABN , First Publish Date - 2020-10-28T10:30:40+05:30 IST
ప్రజలు, పోలీసులు సమానమేనని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరుసగా మూడోరోజు మంగళవారం హిందూ కళాశాల కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు ఐక్యతా పరుగు (రన్ ఫర్ యూనిటీ) నిర్వహించారు.

అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి
గుంటూరు, అక్టోబరు 27 : ప్రజలు, పోలీసులు సమానమేనని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరుసగా మూడోరోజు మంగళవారం హిందూ కళాశాల కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు ఐక్యతా పరుగు (రన్ ఫర్ యూనిటీ) నిర్వహించారు. కరోనా బారిన పడి కోలుకొని తిరిగి దిగ్విజయంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ వారియర్స్‌ను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ గంగాధరం, రూరల్ అదనపు ఎస్పీ ప్రసాద్, ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య, ఎస్‌బీ డీఎస్పీ బాల సుందరరావు, ఏఆర్ డీఎస్పీ చంద్ర శేఖరరావు, సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.