లోక్ అదాలత్‌లో పలు కేసుల పరిష్కారం
ABN , First Publish Date - 2020-12-13T03:38:06+05:30 IST
రాజీయే రాజ మార్గమని, లోక్ అదాలత్‌లో 162 కేసులు పరిష్కారమయ్యాయని పరకాల ప్రిన్సిపల్ జడ్జి హుస్సేన్, అదనపు జడ్జి దిలీప్‌కుమార్, లోక్ అదాలత్ సభ్యులు ఒంటేరు రాజమొగిలి, వెంకటరమణ తెలిపారు. శనివారం పరకాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు.

లోక్ అదాలత్‌లో పలు కేసుల పరిష్కారం
పరకాల, డిసెంబరు 12: రాజీయే రాజ మార్గమని, లోక్ అదాలత్‌లో 162 కేసులు పరిష్కారమయ్యాయని పరకాల ప్రిన్సిపల్ జడ్జి హుస్సేన్, అదనపు జడ్జి దిలీప్‌కుమార్, లోక్ అదాలత్ సభ్యులు ఒంటేరు రాజమొగిలి, వెంకటరమణ తెలిపారు. శనివారం పరకాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. లాక్‌డౌన్‌తో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం పొందేందుకు లోక్ అదాలత్‌ను నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీనివాస్, పరకాల, శాయంపేట, భూపాలపల్లి, రేగొండ, దామెర, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి సీఐలు, ఎస్సైలు, న్యాయవాదులు సురేష్‌కుమార్, గండ్ర నరేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నర్సంపేటలో...
నర్సంపేట: మెగా లోక్‌అదాలత్‌తో కక్షిదారుల కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని నర్సంపేట మెజిస్ర్టేట్ సాంకేత్ మిశ్రా అన్నారు. నర్సంపేట కోర్టు ఆవరణలో శనివారం మెగా లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులు రాజీ పడిన 158 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. జరిమానా రూ.3.40లక్షల వసూలైనట్టు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది అంబటి శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు.