సరికొత్త హంగులతో చైతన్యరథం

ABN , First Publish Date - 2021-07-14T06:16:00+05:30 IST

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు జీవిత కథాంశంతో 80వ దశకంలో రూపొందించిన ‘చైతన్య రథం’ చలన చిత్రాన్ని సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు చిత్ర పంపిణీదారుడు రాజనాల రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

సరికొత్త హంగులతో చైతన్యరథం
మాట్లాడుతున్న ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌ రాజనాల రాజేంద్రప్రసాద్‌

సరికొత్త హంగులతో చైతన్యరథం

 పంపిణీదారుడు రాజనాల రాజేంద్రప్రసాద్‌ 

గవర్నర్‌పేట, జూలై 13: మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు జీవిత కథాంశంతో 80వ దశకంలో రూపొందించిన  ‘చైతన్య రథం’ చలన చిత్రాన్ని సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు చిత్ర పంపిణీదారుడు రాజనాల రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ఫిలిం చాంబర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుచరుడుగా ఎదిగిన రంగా జీవితంలోని ఎన్నో కీలకమైన అంశాలను, ఆయన పోరాటపటిమను, సేవాతత్పరతను నేటి యువ నాయకులకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా చిత్రం కొత్త హంగులతో ముందుకు వస్తుందన్నారు. రంగా వర్ధంతి డిసెంబరు 26న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. సమావేశంలో పంపిణీదారులు నర్రావుల నరేంద్ర, రంగా మిత్రమండలి ప్రతినిధి రంగ సీతారామ్‌, చాంబర్‌ మేనేజర్‌ సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-14T06:16:00+05:30 IST