ఈ ఏడాది 18 కంపెనీలు రూ. లక్ష కోట్ల మైలురాయికి..

ABN , First Publish Date - 2021-08-29T06:34:33+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లో గత ఏడాది ద్వితీయార్ధం నుంచి కొనసాగుతున్న బుల్‌ ర్యాలీలో పలు కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దాంతో ఆ కంపెనీల మార్కెట్‌ విలువ కూడా భారీగా వృద్ధి చెందింది...

ఈ ఏడాది 18 కంపెనీలు రూ. లక్ష కోట్ల మైలురాయికి..

  • అర్ధ శతకానికి చేరువలో మొత్తం కంపెనీల సంఖ్య


దేశీయ స్టాక్‌ మార్కెట్లో గత ఏడాది ద్వితీయార్ధం నుంచి కొనసాగుతున్న బుల్‌ ర్యాలీలో పలు   కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దాంతో ఆ కంపెనీల మార్కెట్‌ విలువ కూడా భారీగా వృద్ధి చెందింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 18 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటేసింది. దాంతో, రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ కలిగిన మొత్తం కంపెనీల సంఖ్య అర్ధ శతకానికి చేరువైంది. గత ఏడాదిలో ఈ కంపెనీలు 28 ఉండగా.. ప్రస్తుతం 46కు చేరుకుంది. మరిన్ని విషయాలు.. 


  1. గత ఏడాది నాటికే ఈ జాబితాలో చోటు కలిగిన కంపెనీలు ఈ ఏడాదిలోనూ తమ స్థానాన్ని పదిలపర్చుకోగలిగాయి.  
  2. గతంలో ఈ హోదాను కోల్పోయిన ప్రభుత్వ రంగ కంపెనీలు (పీఎ్‌సయూ) ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌ ఈ ఏడాది తిరిగి జాబితాలో చోటు దక్కించుకోగలిగాయి. 
  3. ఈ ఏడాది కొత్తగా జాబితాలో చేరిన పీఎ్‌సయూ పవర్‌గ్రిడ్‌. గతేడాది నాటికే ఈ జాబితాలో  స్థానం కలిగిన రెండు పీఎ స్‌యూల్లో.. ఎస్‌బీఐ మార్కెట్‌ విలువ ఈ ఏడాది 49 శాతం వృద్ధి చెందగా, ఓఎన్‌జీసీ మార్కెట్‌ క్యాప్‌ 24 శాతం ఎగబాకింది. 
  4. అదానీ గ్రూప్‌నకు చెందిన ఐదు కంపెనీలు ప్రస్తుతం రూ.లక్ష కోట్ల క్లబ్‌లో ఉన్నాయి. కాగా,  టాటా గ్రూప్‌నకు చెందినవి నాలుగు.
  5. మార్కెట్‌ దిగ్గజ కంపెనీలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో మార్కెట్‌ విలువ ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2.8 లక్షల కోట్లు పెరగగా.. ఇన్ఫోసిస్‌ రూ.2 లక్షల కోట్లు, రిలయన్స్‌ రూ.1.7 లక్షల కోట్లు, విప్రో రూ.1.2 లక్షల కోట్ల మేర మార్కెట్‌ విలువను పెంచుకోగలిగాయి. 
  6. మార్కెట్లో బుల్‌ ర్యాలీ దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో మున్ముందు మరిన్ని కంపెనీల మార్కెట్‌ విలువ ఈ మైలురాయిని దాటేందుకు అవకాశాలు పరిమితమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2021-08-29T06:34:33+05:30 IST