పర్యాటక కేంద్రంగా మార్కండేయ డ్యామ్‌

ABN , First Publish Date - 2021-06-18T18:51:59+05:30 IST

బూదికోటెలోని మార్కండే య డ్యామ్‌ను పర్యాటకకేంద్రంగా తీర్చనున్నట్టు ఓడ రేవులు, మత్స్యశాఖ మంత్రి ఎస్‌ అంగార పేర్కొన్నారు. మార్కండేయ డ్యామ్‌ను గురువారం సందర్శించి చేపల పెంపక

పర్యాటక కేంద్రంగా మార్కండేయ డ్యామ్‌


బంగారపేట(కర్ణాటక): బూదికోటెలోని మార్కండేయ డ్యామ్‌ను పర్యాటకకేంద్రంగా తీర్చనున్నట్టు ఓడ రేవులు, మత్స్యశాఖ మంత్రి ఎస్‌ అంగార పేర్కొన్నారు. మార్కండేయ డ్యామ్‌ను గురువారం సందర్శించి చేపల పెంపక కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరుణుడి కృపతో, కేసీవ్యాలీ నుంచి మార్కండేయ డ్యామ్‌ను నింపనున్నట్టు తెలిపారు. చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చేపల ఉత్పత్తిలో కరావళి, ఒళనాడు అని రెండు విభాగాలుగా ఉంటుందని ఈమేరకు అధికారులతో చర్చించి అభివృద్ధి చేపడతామన్నారు. కరావళి (కోస్తా) ప్రాంత రకం చేపలకు డిమాండ్‌ ఉందని ఆ దిశగా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా చేపల నిల్వలు, విక్రయా లకు వీలుగా కోల్డ్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. కోలారు ఎంపీ ఎస్‌ మునిస్వామి మాట్లాడుతూ జిల్లాలో రెండువేలకుపైగా చెరువులు ఉన్నాయని కేసీ వ్యాలీనుంచి పలు చెరువులు నిండాయన్నారు. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో రానున్న రోజుల్లో చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సభ్యుడు మహేశ్‌, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్‌ సీఎస్‌ అనంత, సహాయక డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T18:51:59+05:30 IST