ప్రొఫెస‌ర్ అయ్యేందుకు మంత్రి త‌మ్ముడు ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-05-23T16:12:06+05:30 IST

యూపీ ప్రాథ‌మిక విద్యాశాఖ మంత్రి డాక్ట‌ర్ స‌తీష్...

ప్రొఫెస‌ర్ అయ్యేందుకు మంత్రి త‌మ్ముడు ఏం చేశాడంటే...

ల‌క్నో: యూపీ ప్రాథ‌మిక విద్యాశాఖ మంత్రి డాక్ట‌ర్ స‌తీష్ ద్వివేది సోద‌రుడు అరుణ్ ద్వివేది... సిద్ధార్థ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎన్నిక కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అతను ఈడ‌బ్ల్యుఎస్‌ (ఆర్థికంగా వెనుక‌బ‌డిన‌ జనరల్ అభ్యర్థి) కోటాలో సైకాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ఎంపికయ్యారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై వీసీ ప్రొఫెస‌ర్ సురేంద్ర దుబే మాట్లాడుతూ  ఈ పోస్టుకు మెరిట్ ఆధారంగా ప‌దిమంది అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశామ‌న్నారు. 


వీరిని ఇంటర్వ్యూ చేయ‌గా, అరుణ్ ద్వితీయ స్థానంలో నిలిచార‌న్నారు. ఇంటర్వ్యూ, అకాడ‌మిక్, ఇతర మార్కులు జోడించిన తరువాత అరుణ్ మొదటి స్థానంలో నిలిచార‌న్నారు. ఈ  విధంగానే అరుణ్ ఎంపిక‌య్యార‌న్నారు. ఈ డ‌బ్ల్యుఎస్ స‌ర్టిఫికెట్ అడ్మినిష్ట్రేష‌న్ అధికారులు ఇస్తార‌ని, అత‌ని విద్యా ధృవీకరణ పత్రాలు సరిగానే ఉన్నాయ‌న్నారు. ఇంటర్వ్యూకు సంబంధించిన‌ వీడియో రికార్డింగ్ ఉంద‌న్నారు. అరుణ్‌ మంత్రి సోదరుడని తాను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాన‌న్నారు. ఈడ‌బ్ల్యుఎస్ సర్టిఫికెట్ నకిలీద‌ని తేలితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అయితే మంత్రి డాక్టర్ సతీష్ ద్వివేది ఈ ఉదంతంపై స్పందించడానికి నిరాకరించారు. 

Updated Date - 2021-05-23T16:12:06+05:30 IST