వైసీపీలో ఫ్లెక్సీల గొడవ

ABN , First Publish Date - 2022-12-16T23:52:45+05:30 IST

వైసీపీ రాయలసీమ రీజనల్‌ కోఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెనుకొండ పర్యటన ఆపార్టీలో ఫ్లెక్సీల వివాదానికి దారితీసింది.

వైసీపీలో ఫ్లెక్సీల గొడవ

డీఎస్పీకి ఫిర్యాదు

పెనుకొండ టౌన, డిసెంబరు 16: వైసీపీ రాయలసీమ రీజనల్‌ కోఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెనుకొండ పర్యటన ఆపార్టీలో ఫ్లెక్సీల వివాదానికి దారితీసింది. మంత్రిని స్వాగతిస్తూ పట్టణంలో వంద దాకా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, తమ పార్టీలోనే గిట్టని మండలస్థాయి నాయకులు కొందరు వాటిని చించివేశారని ఆపార్టీ నాయకుడు బ్రహ్మసముద్రం శ్రీనివాసులు ఆరోపించారు. ఈవిషయమై శుక్రవారం డీఎస్పీ హు స్సే టనపీరాకు ఫిర్యాదు చేశారు. ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లెక్సీల వివాదాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Updated Date - 2022-12-16T23:52:49+05:30 IST

News Hub