GRASS : పీడిస్తున్న పశుగ్రాసం కొరత
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:22 AM
వ్యవసాయం తరువాత పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం ఇక్కడి రైతుల జీవానాధారం. పశుగ్రాసం కొరతతో ధరలు ఆకాశాన్నంటుతుంటంతో మూగజీవాల పెంపకం రైతులకు భారంగ మారింది. అరకొరగా గ్రాసం తింటూ మూగజీవాలు అలమటిస్తున్నాయి. రాష్రంలోనే కనగానపల్లి మండలం గొర్రెలు, మేకలు పెంపకంలో ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ విశాలమైన మైదానాలు, కొండలు, గుట్టలు ఉండ టంతో ఎక్కువ మంది ప్రజలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు.

- ఆకాశాన్నంటుతున్న గ్రాసం ధరలు
- భారమవుతున్న పశువులు, గొర్రెల పెంపకం
కనగానపల్లి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం తరువాత పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం ఇక్కడి రైతుల జీవానాధారం. పశుగ్రాసం కొరతతో ధరలు ఆకాశాన్నంటుతుంటంతో మూగజీవాల పెంపకం రైతులకు భారంగ మారింది. అరకొరగా గ్రాసం తింటూ మూగజీవాలు అలమటిస్తున్నాయి. రాష్రంలోనే కనగానపల్లి మండలం గొర్రెలు, మేకలు పెంపకంలో ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ విశాలమైన మైదానాలు, కొండలు, గుట్టలు ఉండ టంతో ఎక్కువ మంది ప్రజలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్క కనగానపల్లి మండలంలోనే లక్షా అరవై వేలు గొర్రెలు, మేకలున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇక రాప్తాడు నియోజవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 10 లక్షలు గొర్రెలు, మేకలు ఉండగా, 12వేల వరకు ఆవులు, ఎద్దులు, గేదెలున్నాయి. ఈ యేడాది రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతుండటంతో పచ్చిక బయళ్లు ఎండుబారాయి. కొండలు, గుట్టలు , మైదానాల్లో ఎక్కడ చూసినా ఎండుగడ్డే కనబడుతోంది. ఆ ఎండుగడ్డినే మేస్తూ మూగజీవాలు కడుపు నింపుకొంటు న్నాయి. కొందరు ఆకతాయిలు ఎండుగడ్డికి నిప్పు పెడుతుండంతో అది కూడా జీవాలకు అందకుండా పోతోంది. దీనికి తోడు సమీప వాగుల్లో కుంటల్లో నీరు లేకపోవడంతో మూగజీవాలు తాగునీటికి కూడా అలమటించేపరిస్థితి నెలకొంది.
ఆకాశాన్నంటిన ధరలు : ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్స రం పశుగ్రాసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గొర్రెల పెంపకంపైనే ఆధారప డ్డ కాపరులు ధర ఎంత పెరిగినా కొనుగోలు చేసి వాటిని మేపుతు న్నారు. ప్రస్థుతం ఒక ట్రాక్టరు వరిగడ్డి రూ. 20వేలు ఉండగా, వేరుశనగ పొట్టు రూ. 40వేలు ఉందని రైతులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....