Pawan Kalyan: 4 లక్షల మందికి పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు?.. జగన్‌ను ప్రశ్నించిన పవన్
ABN , First Publish Date - 2022-12-28T18:16:27+05:30 IST
పెన్షన్ల (pensions) తొలగింపుపై సీఎం జగన్ (CM Jagan)కు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లేఖ రాశారు. 4 లక్షల మందికి పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు?
పెన్షన్ల తొలగింపుపై సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ లేఖ
ప్రభుత్వం అర్హులైన ప్రతిఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలి
రూ.3 వేలు పెన్షన్లు ఇస్తామన్న హామీని ఈ విధంగా అమలు చేస్తారా?
పెన్షన్ల తొలగింపునకు కారణాలు కూడా సహేతుకంగా లేవు
అమరావతి: పెన్షన్ల (pensions) తొలగింపుపై సీఎం జగన్ (CM Jagan)కు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లేఖ రాశారు. 4 లక్షల మందికి పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు? అని పవన్ ప్రశ్నించారు.పెన్షన్లు తొలగించేందుకే అధికారులు నోటీసులిచ్చారని, పెన్షన్ల తొలగింపునకు కారణాలు కూడా సహేతుకంగా లేవని పవన్ తెలిపారు. రూ.3 వేలు పెన్షన్లు ఇస్తామన్న హామీని ఈ విధంగా అమలు చేస్తారా? అని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వం అర్హులైన ప్రతిఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలని, అంతేకానీ పెన్షన్లు పెంచేందుకు లబ్ధిదారులను తగ్గించొద్దని పవన్ స్పష్టం చేశారు. మీ పాలనలో ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెన్షన్ల తొలగింపు చేపట్టడం ఏమిటి? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.