సీఎం జగన్‌పై ప్రజా తిరుగుబాటు ఖాయం: వర్ల కుమార్‌రాజా
ABN , First Publish Date - 2022-12-03T00:40:26+05:30 IST
యంతలా పాలన చేస్తున్న సీఎం జగన్‌పై ప్రజలు తిరుగుబాటు చేయటం ఖాయమని, రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి బంగాళాఖాతంలో విసిరివేయడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా హెచ్చరించారు.

తోట్లవల్లూరు, డిసెంబరు 2: నియంతలా పాలన చేస్తున్న సీఎం జగన్‌పై ప్రజలు తిరుగుబాటు చేయటం ఖాయమని, రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి బంగాళాఖాతంలో విసిరివేయడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా హెచ్చరించారు. తోట్లవల్లూరు మండలం గరికపర్రులో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వీరపనేని శివరాంప్రసాద్, వీరంకి వెంకట గురుమూర్తి, వీరంకి రామాదేవి, నర్రా వెంకట అప్పారావు, వీరంకి వరహాలరావు, ఈడ్పుగంటి లక్ష్మీశ్రీ, నెక్కలపూడి మురళి పాల్గొన్నారు.
ఆర్తమూరులో..
బంటుమిల్లి: అర్తమూరులో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని పార్టీ గ్రామ అధ్యక్షుడు కాగిత బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. బొర్రా కాశీ, భూపతి రమేష్, తెనాలి సుధాకర్ పాల్గొన్నారు.