జగన్ అండ్ కో రాష్ర్టాన్ని కొల్లగొడుతున్నారు!
ABN , First Publish Date - 2022-11-03T00:56:20+05:30 IST
: రాష్ర్టాన్ని కొల్లగొడుతున్న జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. పురిటిపాడు పంచాయతీలో బుధవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

గుడ్లవల్లేరు : రాష్ర్టాన్ని కొల్లగొడుతున్న జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. పురిటిపాడు పంచాయతీలో బుధవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని అధ్వాన్న స్థితికి తీసుకొచ్చాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దొరికినంత దోచుకో.. దాచుకో చందంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అడుసుమిల్లి రామ్మోహనరావు(చంద్రాల చిట్టిబాబు), జంగం మోహనరావు, తూము పద్మజ, శాయిన పు ష్పావతి, బెజవాడ వెంకన్న, మోహన్, మేకా అనిల్, గంటయ్య, బెల్లంకొండ ఏడుకొండలు, కాగిత నరేంద్ర, బొర్రా మధు, బొర్రా జయప్రసాద్, మట్టా వంశి, పోలగాని వనబాబు, పెద్దిబోయిన రాజు, బొర్రా ధనకోటి కోలా రాధాకృష్ణ (నాయుడు), ఎస్.వి.ఎస్ ప్రసాద్, అట్లూరి స్వరూప్ పాల్గొన్నారు.