Chandrababu: ఆస్తులు సంపాదించే మార్గం నాకు.. తాకట్టు పెట్టడం జగన్‌కు తెలుసు..

ABN , First Publish Date - 2022-11-17T16:17:46+05:30 IST

అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉందని, విద్యార్థులను గంజాయి మత్తులోకి దించుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఆరోపించారు.

Chandrababu: ఆస్తులు సంపాదించే మార్గం నాకు.. తాకట్టు పెట్టడం జగన్‌కు తెలుసు..

కర్నూలు జిల్లా: అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉందని, విద్యార్థులను గంజాయి మత్తులోకి దించుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఆరోపించారు. గురువారం కర్నూలు జిల్లా ఆదోని (Adoni)లో రోడ్షో (Road Show) నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘డబ్బులు సంపాదించే మార్గం నాకు తెలుసు.. ఆస్తులు తాకట్టు పెట్టే మార్గం జగన్‌కు తెలుసు’అని అన్నారు. తనపై కేసు పెట్టేందుకు వైఎస్సార్ (YSR) కూడా సాహసించలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ (TDP) సిద్ధంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆదోనిలో స్థానికంగా ఇసుక దొరకడం లేదు.. కానీ హైదరాబాద్, బెంగళూరులో దొరుకుతోందని.. సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి లారీల్లో డబ్బులు చేరుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఈడీ దాడుల భయంతోనే జగన్ వైన్ షాపుల్లో.. ఆన్‌లైన్ పేమెంట్లు తీసుకోవడం లేదని ఆరోపించారు. నాసీరకం పత్తి విత్తనాలతో రైతులు నిండా మునిగారన్నారు. ఒకే రాజధాని కావాలని ఆదోని ప్రజలు చెబుతున్న విషయాన్ని.. తాడేపల్లి నివాసంలో ఉన్న జగన్ (Jagan), పేటీఎం బ్యాచ్ చూడాలన్నారు. సీఎం జగన్‌కు ధమ్ముంటే.. ఆదోని వచ్చి మూడు రాజధానుల గురించి అడగాలన్నారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని రానివ్వడం లేదని స్థానికులు చంద్రబాబుకు చెప్పారు. దీనిపై స్పందించిన ఆయన.. తాను తలుచుకుంటే సాక్షి పేపర్ మనుగడ ఉండేదా? అని ప్రశ్నించారు. మీడియా ప్రసారాలను పురుద్ధరించకపోతే.. అధికారంలోకి వచ్చిన వెంటనే కేబుల్ నెట్‌వర్క్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 150 అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపుకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సీఎం అయి ఉంటే పెన్షన్లు రూ.3 వేలు ఇచ్చే వాడినని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2022-11-17T16:17:50+05:30 IST

News Hub