Raghu Rama Krishna Raju: పవన్ కల్యాణ్‌కు భద్రత కల్పించండి.. అమిత్‌షాకు లేఖ
ABN , First Publish Date - 2022-11-04T17:28:54+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju)లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (PAWAN KALYAN)కు భద్రత ముప్పు ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. పవన్ ఇంటిముందు రెక్కీ అంశాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు లేఖలో రఘురామ తెలిపారు.
పవన్ నివాసం ముందు బైక్, కార్లతో రెక్కీ చేశారని రఘురామ తెలిపారు. ఏపీలో పవన్ చేపట్టే బస్సుయాత్రలో ముప్పు ఉండొచ్చని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినానని, కేంద్రం పవన్‌కు భద్రత కల్పించాలని లేఖలో కోరినట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.