సీజీఆర్‌ఎఫ్‌తో సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2022-11-19T23:37:59+05:30 IST

విద్యుత్‌ వినియోగదారు ల ఫిర్యాదులు, సమస్య లను సీజీఆర్‌ఎఫ్‌ (విద్యుత్‌ వినియోగదారుల ఫోరం)ద్వారా పరిష్కరిస్తున్నట్లు ఫోరం చైర్మన్‌, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి బి.సత్యనారాయణ తె లిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు సముదాయంలోని న్యాయసేవా సదన్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగ రం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా ల్లోని వినియోగదారుల సమస్యలను ఫోరం పరిష్కరిస్తుం దన్నారు.

సీజీఆర్‌ఎఫ్‌తో సమస్యల పరిష్కారం
మాట్లాడుతున్న ఫోరం చైర్మన్‌ సత్యనారాయణ:

అరసవల్లి, నవంబరు 19: విద్యుత్‌ వినియోగదారు ల ఫిర్యాదులు, సమస్య లను సీజీఆర్‌ఎఫ్‌ (విద్యుత్‌ వినియోగదారుల ఫోరం)ద్వారా పరిష్కరిస్తున్నట్లు ఫోరం చైర్మన్‌, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి బి.సత్యనారాయణ తె లిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు సముదాయంలోని న్యాయసేవా సదన్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగ రం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా ల్లోని వినియోగదారుల సమస్యలను ఫోరం పరిష్కరిస్తుం దన్నారు. విద్యుత్‌ సరఫరాలో హెచ్చు తగ్గులు, అంతరా యం, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, నిరాకరణ, మీటరు ఆగిపోవడం లేదా ఎక్కువగా తిరగడం తదితర సమస్యలపై ఫోరంనకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనికి ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు, శాశ్వత లోక్‌ అదాలత్‌ సభ్యుడు సువర్ణరాజు, జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు ఆర్‌.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T23:38:01+05:30 IST