RK Beach: మందుబాబుల వీరంగం.. ఓ మహిళను...
ABN , First Publish Date - 2022-11-24T14:15:51+05:30 IST
మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు.. మహిళను

విశాఖ: ఆర్కే బీచ్(RK Beach) నగరవాసులతో... పర్యాటకులతో నిత్యం కళకళలాడుతుంటోంది. బీచ్ ఒడ్డున కూర్చుని సేదదీరుతుంటారు. ఎంతో రద్దీగా ఉండే ఆర్కేబీచ్‌లో నిన్న(బుధవారం) రాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు.. మహిళను దుర్భాషలాడారు. యువకుల చర్యలతో బాధితురాలు హడలిపోయింది. దీంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నర్సీపట్నంకు చెందిన అశోక్, జగదీష్‌గా పోలీసులు గుర్తించారు.