G Square Housing: హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ప్లాట్ ప్రమోటర్ జీ స్క్వేర్
ABN , First Publish Date - 2022-09-16T03:28:24+05:30 IST
చెన్నై, కోయంబత్తూరు, త్రిచి, హోసూర్, మైసూర్, బల్లారి తదితర నగరాల్లో సత్తా చాటిన జీ స్క్వేర్ హౌసింగ్ (G Square Housing)
హైదరాబాద్: చెన్నై, కోయంబత్తూరు, త్రిచి, హోసూర్, మైసూర్, బల్లారి తదితర నగరాల్లో సత్తా చాటిన జీ స్క్వేర్ హౌసింగ్ (G Square Housing) ఇప్పుడు హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రమోటర్‌గా ఖ్యాతి గడించిన ఈ సంస్థ ఇప్పుడు తెలంగాణాలోనూ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టింది. హైదరాబాద్ నాగార్జున సాగర్ రోడ్‌లో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న బీఎన్‌రెడ్డి నగర్‌తో పాటు త్వరలో ప్రారంభంకానున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌కు అతి సమీపంలో ఉన్న షాద్‌నగర్‌లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి.
జీ స్క్వేర్ ఇప్పటి వరకు 60 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఈ సంస్థకు 4500కు పైగా వినియోగదారులు ఉన్నారు. దక్షిణ భారతదేశంలో దాదాపు 1000 ఎకరాల భూమిని వినియోగదారులకు అభివృద్ధి చేసి అందించింది. ప్లాటెడ్ కమ్యూనిటీలోని సభ్యులందరికీ ప్రపంచ శ్రేణి వసతులు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తోంది. అలాగే తమ వినియోగదారులకు 100 శాతం క్లియర్ డాక్యుమెంటేషన్, ఐదేళ్ల ఉచిత నిర్వహణ అందిస్తోంది. జీస్క్వేర్ ప్రాజెక్టులన్నీ నివాస, వాణిజ్య ప్లాట్స్‌గా ఉంటాయి. తక్షణమే నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా ఉంటాయి. తెలంగాణలో అడుగుపెట్టిన సందర్భంగా హౌసింగ్ సీఈవో ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించినందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ కోసం తాము భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు.