గాలి నుంచి నీటిని తయారు చేసే ఉత్పత్తులను భారత్‌లో లాంచ్ చేసిన వాటర్‌జెన్
ABN , First Publish Date - 2022-05-31T01:11:59+05:30 IST
సరికొత్త సాంకేతికలతో గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సంస్థ వాటర్‌జెన్

న్యూఢిల్లీ: సరికొత్త సాంకేతికలతో గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సంస్థ వాటర్‌జెన్ భారత్‌లో లాంచ్ చేసింది. భారత్‌కు ఈ గ్లోబల్ పేటెంట్ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ఎస్ఎంవీ జైపురియా గ్రూప్ (SMV Jaipuria Group)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సాంకేతికతతో అత్యంత నాణ్యత కలిగిన, మినరలైజ్డ్, సురక్షిత తాగునీటిని గాలి నుంచి ఉత్పత్తి చేయవచ్చు. వాటర్‌జెన్ తన ఉత్పత్తులను జెన్నీ, జెన్-ఎంఐ, జెన్ ఎంఐ ప్రొ, జెన్–ఎల్ రూపంలో తీసుకొస్తోంది. వీటి సామర్థ్యం రోజుకు 30 నుంచి 6వేల లీటర వరకూ ఉంటాయి. ఈ ఉత్పత్తుల కనీస ధర రూ. 2.5 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇవి పాఠశాలలు, ఆస్పత్రులు, పార్కులు, రిసార్ట్లు, కన్స్ట్రక్షన్ సైట్లు సహా తాత్కాలిక ప్రాంతాలకు అనువుగా ఉంటాయి.
ఈ సందర్భంగా వాటర్‌జెన్ ఇండియా సీఈవో మాయన్ ముల్లా మాట్లాడుతూ.. భారత్ తమ టాప్-3 మార్కెట్లలో ఒకటని అన్నారు. ప్రతి ఒక్కరికి సురక్షితమైన మినరలైజ్డ్ వాటర్‌ను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్ఎంవీ జైపురియా గ్రూప్ డైరెక్టర్ చైతన్య జైపురియా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కువశాతం మంది ప్రజలు స్వచ్ఛమైన, సహజసిద్ధమైన తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. ఈ సమస్యకు వాటర్‌జెన్ పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.