Lalu Yadav:లాలూ యాదవ్‌పై సీబీఐ విచారణ ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-26T10:11:32+05:30 IST

రైల్వే ప్రాజెక్టుల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూ యాదవ్‌పై సీబీఐ మళ్లీ....

Lalu Yadav:లాలూ యాదవ్‌పై సీబీఐ విచారణ ప్రారంభం
CBI Reopens Probe Against Lalu

న్యూఢిల్లీ: రైల్వే ప్రాజెక్టుల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూ యాదవ్‌పై సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభించింది.(CBI Reopens)యూపీఏ-1 ప్రభుత్వంలో లాలూ యాదవ్‌(Lalu Yadav) మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై(Railway Projects Case) సీబీఐ 2018లో విచారణ ప్రారంభించింది.నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) తో జతకట్టిన కొన్ని నెలల తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అవినీతి కేసును తిరిగి తెరిచింది.

అవినీతి ఆరోపణలపై ఎలాంటి కేసు నమోదు చేయక పోవడంతో గతంలో విచారణ ముగిసింది. రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసులో లాలూయాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, లాలూ కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్‌లు నిందితులుగా ఉన్నారు. ఇటీవల సింగపూర్ దేశంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న లాలూపై సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభించడం సంచలనం రేపింది.

Updated Date - 2022-12-26T11:13:43+05:30 IST