Lady Commandos: సీఎం స్టాలిన్‌కు లేడీ కమాండోల భద్రత
ABN , First Publish Date - 2022-12-13T07:25:54+05:30 IST
ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు పోలీసు భద్రత పెంచారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా కమాండో బల

ప్యారీస్(చెన్నై), డిసెంబరు 12: ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు పోలీసు భద్రత పెంచారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా కమాండో బలగాలను సీఎం స్టాలిన్ భద్రతా విభాగంలో తాజాగా చేర్చారు. కమాండో విభాగం ఎస్‌ఐ ధనుస్ కన్నగి నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ దిల్షా బేగం, కానిస్టేబుళ్లు ఆర్.విద్య, జె.సుమతి, కాళీశ్వరి, పవిత్ర, మోనీషా, రమ్య తమ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రప్రభుత్వం మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖలో మహిళా కమాండో విభాగాన్ని పరిచయం చేసింది. పోలీసు శాఖలోని 80 మంది మహిళలు కమాండో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పురుషులకు ధీటుగా నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో నెగ్గారు. ఈ మహిళా కమాండోలు సీఎం పర్యటన వివరాలు గుప్తంగా ఉంచాలి. తమ కుటుంబసభ్యులకు కూడా వీరు పాల్గొనే కార్యక్రమాల వివరాలు తెలియజేయరాదని ప్రమాణస్వీకారం చేశారు.