D sureshbabu: పరిశ్రమ బాగు కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం!
ABN , First Publish Date - 2022-12-11T17:50:33+05:30 IST
‘‘ఇప్పుడు ప్రతి నిర్మాణ సంస్థ(TFI) ఓ పరిశ్రమగా మారి స్వంత నిబంధనలతో ముందుకెళ్తుంది. ఇక్కడ పరిశ్రమ బాగు కంటే తన సినిమా ఆడాలనే వ్యక్తిగత ప్రయోజనాన్నే చూస్తారు. ఆ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. అందరికీ థియేటర్లు ఇవ్వాలి, అందరూ వాళ్ల సినిమాల్ని విడుదల చేసుకోవాలి. అంతిమంగా బాగున్న సినిమా ఎక్కువ థియేటర్లు పొందుతుంది’’ అని డి.సురేశ్‌బాబు (D sureshbabu)అన్నారు.
‘‘ఇప్పుడు ప్రతి నిర్మాణ సంస్థ(TFI) ఓ పరిశ్రమగా మారి స్వంత నిబంధనలతో ముందుకెళ్తుంది. ఇక్కడ పరిశ్రమ బాగు కంటే తన సినిమా ఆడాలనే వ్యక్తిగత ప్రయోజనాన్నే చూస్తారు. ఆ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. అందరికీ థియేటర్లు ఇవ్వాలి, అందరూ వాళ్ల సినిమాల్ని విడుదల చేసుకోవాలి. అంతిమంగా బాగున్న సినిమా ఎక్కువ థియేటర్లు పొందుతుంది’’ అని డి.సురేశ్‌బాబు (D suresh babu)అన్నారు. వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటించిన ‘నారప్ప’ (Narappa in theatres) చిత్రం గతంలో ఓటీటీలో విడుదలైంది. ఈ నెల 13న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ మధ్య హీరోల పుట్టినరోజును పురస్కరించుకుని ఆయా హీరోల చిత్రాలను మరోసారి విడుదల చేయడం ట్రెండ్‌గా మారింది. ఇది మంచి పరిణామం. వెంకటేశ్ అభిమానులు నారప్ప చిత్రాన్ని థియేటర్‌లో చూడాలుందని కోరారు. అందుకే వెంకటేశ్ పుట్టినరజు సందర్భంగా సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు. దీనిపై వచ్చిన ఆదాయాన్ని విద్య, పర్యావరణ పరిరక్షణ, ఇతర సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలనుకుంటున్నాం. వెంకటేష్ కొత్త సినిమా విశేషాలను ఫిబ్రవరిలో ప్రకటిస్తాం.‘హిరణ్యకశ్యప’ సినిమాకి సంబంధించిన పనులు మరో పెద్ద దర్శకుడితో కలిసి చేస్తున్నాం. ఆ వివరాల్ని రానా చెబుతారు. అబి?రామ్ నటుడు అవుతాడని అనుకోలేదు. తాత నన్ను నటనవైపు వెళ్లమని చెప్పారని తను రూట్ ఎంచుకున్నాడు. మంచి డేట్ చూసి అతని సినిమా విడుదల చేస్తాం. (Suresh babu comments on Ticket rates)
ఎవరూ ఏ సినిమానీ ఆపలేరు...
ఇటీవల జరిగిన గిల్డ్ బంద్‌కి, దానికి సంబంధించిన చర్చలకు నేను వెళ్లలేదు. అది సరైన నిర్ణయం అని నాకు అనిపించలేదు. కానీ కొద్దిమంది అదే కరెక్ట్ అని నమ్మారు. జరిగిన మేలు ఏంటో అంతా చూశాం. ఏం లేదనేది వేరే చర్చ. సంక్రాంతి సినిమాల విషయం కూడా అంతే. ఎవరూ ఏ సినిమానీ ఆపలేరు. మంచి సినిమాను ఆపే శక్తి ఎవరికీ లేదు. చిత్ర పరిశ్రమలో భిన్నమైన సమస్యల మీద, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. అందులో ఇది కరెక్ట్.. మరొకటి రాంగ్ అని ఎవ్వరం చెప్పలేం. ఈ మధ్యన బాలకృష్ణ ఓ షోలో ‘నన్ను టికెట్ ధరల పెంపు విషయంలో అడగడానికి విజయవాడకి మీరెందుకు వెళ్లలేదని అడిగారు. టికెట్ ధరల పెంపునకు నేను వ్యతిరేకిని. ధరలు పెంచకూడదని నా అభిప్రాయం. అలా చేయడం వల్ల మధ్యతరగతిని సినిమాకు దూరం చేసినవాళ్లం అవుతాం. అయితే భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలకు పెంచుకోవడం న్యాయమే! ‘అవతార్2’ చిత్రాన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్‌ల్లో రూ. 3 వేలకి అమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్లు అంతగా ఖర్చుపెట్టి తీశారు. రూ.కోటితో తీసిన సినిమా నిర్మాతనీ, రూ.500 కోట్లతో తీసిన నిర్మాతనీ ఓ ఒకేలా చూడలేం.