RajaniKanth: కూలీల సాయం... తెలియని వ్యక్తి నమ్మడం అదే తొలిసారి!
ABN , First Publish Date - 2022-10-31T19:16:25+05:30 IST
సూపర్‌స్టార్ రజనీకాంత్ పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. సినిమా అవకాశాల కోసం మద్రాస్‌లో వెళ్లడానికి సిద్ధపడిన రోజుల్లో జరిగన ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajani kanth)పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. సినిమా అవకాశాల కోసం మద్రాస్‌లో వెళ్లడానికి సిద్ధపడిన రోజుల్లో జరిగన ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. తన సంపాదనలో సగభాగం పేద ప్రజలకు ఖర్చు చేస్తున్న ఆయన ఒక సందర్భంలో ట్రైన్ టికెట్‌కు (Train ticket) డబ్బులు లేకపోతే అక్కడి కూలీలు (railway coolies help)సాయం చేసేందుకు ముందుకు వచ్చారనే విషయం తెలుసా? ఈ విషయాన్ని స్వయంగా తలైవా (Thalaiva)వెల్లడించారు. ‘ఎస్సెసెల్సీ చదివేటప్పుడు ఇంట్లోవాళ్లు పరీక్ష ఫీజు కోసం రూ.150 ఇచ్చారు. పరీక్ష ఫెయిల్ అవుతానని నాకు ముందే తెలుసు. అందుకే మద్రాస్ దారి పట్టాను. మార్గ మధ్యలో ట్రైన్ టికెట్ పడిపోయింది. టికెట్ ఇన్‌స్పెక్టర్‌కు జరిగిన విషయం చెప్పినా జరిమానా కట్టాల్సిందే అంటూ అందరి ముందూ గట్టిగా అరిచారు. అప్పుడు ఐదుగురు కూలీలు నాకు డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ‘నేను టికెట్ తీసుకోలేదనుకుంటున్నారేమో! కానీ నేను టికెట్ తీసుకున్నది నిజం. ఆ విషయాన్ని టీసీకి చెప్పినా నమ్మడం లేదు’ అన్నాను. అప్పుడు టికెట్ ఇన్‌స్పెక్టర్ నమ్మారు. తెలియని వ్యక్తి నన్ను నమ్మడం మొదటిసారి. ఆ తర్వాత మద్రాస్‌కు వచ్చాక కె.బాలచందర్ నన్ను నమ్మారు. ఆయన నమ్మకాన్ని గెలిపించాను. ఇప్పుడు ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో వమ్ము కానియ్యను’’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘జైలర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థలో ఇటీవల రెండు చిత్రాలకు సైన్ చేశారు.