#RIPKrishna Live Updates: ఈ రాత్రికి స్వగృహంలోనే కృష్ణ పార్థివదేహం

ABN , First Publish Date - 2022-11-15T10:09:25+05:30 IST

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని ఈ రాత్రికి నానక్‌రామ్‌గూడలోని స్వగృహం ‘విజయకృష్ణ నిలయం’లోనే ఉంచనున్నారు. మంగళవారం సూర్యాస్తమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు నానక్‌రామ్‌గూడలోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించవచ్చు.

#RIPKrishna Live Updates: ఈ రాత్రికి స్వగృహంలోనే కృష్ణ పార్థివదేహం

06:55 pm: సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, సిద్ధూ జొన్నలగడ్డ.

Untitled-17.jpg

సూపర్‌స్టార్ కృష్ణ చివరి కోరిక ఇదే..

5:50 pm : సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని ఈ రాత్రికి నానక్‌రామ్‌గూడలోని స్వగృహం ‘విజయకృష్ణ నిలయం’లోనే ఉంచనున్నారు. మంగళవారం సూర్యాస్తమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు నానక్‌రామ్‌గూడలోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించవచ్చు. అయితే భౌతికకాయాన్ని రేపు గచ్చిబౌలి స్టేడియానికి కాకుండా పద్మాలయ స్టూడియోకి తరలించనున్నారు. రేపు (బుధవారం) మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.

5:25 pm : కృష్ణ భౌతికకాయాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చిన మోహన్ బాబు..

05:02 pm : సూపర్‌స్టార్ కృష్ణకు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత మహేష్ బాబును ఓదార్చిన ప్రముఖ హీరో ప్రభాస్

Untitled-9.jpg

04:59 pm : సూపర్‌స్టార్ కృష్ణ మృతికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) తీవ్ర సంతాపం.

హీరో కృష్ణను (Hero Krishna) దమ్ము, ధైర్యమున్న డ్యాషింగ్ హీరో అని ఎందుకు అంటారో తెలిపే మరో ఉదాహరణ ఇది. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో ఆ ఉద్యమానికి మద్దతు తెలపడానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం భయపడింది. కానీ సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మాత్రం డేరింగ్‌గా మద్దతు తెలిపారు. అంతేకాదు ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పటి అరుదైన ఫొటో ఇది.

Untitled-7.jpg

Untitled-8.jpg

04:41 pm: సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన జనసేన అధ్యక్షుడు, ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్.

Untitled-6.jpg

04:30 pm: రేపు ఉదయం హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్‌. కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

cm-jagan.jpg

04:20 pm: కృష్ణ నాకు ఆప్తుడు, ఆత్మీయుడే కాదు.. అన్నింటికీ మించి సోదరుడి లాంటి వాడు. అటువంటి వ్యక్తి దివికేగడం చాలా విచారకరమైన విషయం. దర్శకుడు కళాతపస్వి, కె. విశ్వనాథ్

e8a5452d-7905-48c4-9eab-e605c3dfcaa4.jfif

04:15 pm: సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రభాస్

prabhas.jpg

04:10 pm: కృష్ణ భౌతికకాయానికి అంజలి ఘటించి ప్రార్థనలు చేసిన కేఏ పాల్

ka-paul.jpg

03:55 pm: నేను ఈరోజు మూడుపూటలా భోజనం చేయడానికి కారణం కృష్ణ గారే: పృథ్వీ

03:50 pm: కలిసే ఇండస్ట్రీకి వచ్చారు, కలిసే పైకి వెళ్లిపోయారు: కృష్ణంరాజు భార్య

kr-wife.jpg

03:45 pm: సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపం ప్రకటిస్తూ గౌరవ సూచనగా బుధవారం తెలుగు సినిమా పరిశ్రమ బంద్.. నిర్మాతల మండలి ప్రకటన

* ఇందు మూలంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలియజేయునది. ప్రముఖనటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత, సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు ఉదయం హైదరాబాదులో స్వర్గస్తులైనారు. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ గారికి గౌరవ సూచనగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ రేపు (బుధవారం 16-11-2022) మూసివేయడం జరుగుతుంది.

టి. ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల

గౌరవ కార్యదర్శులు

press-note.jpg

03:30 pm: సూపర్‌స్టార్ కృష్ణ వ్యక్తిత్వం ఏంటనేది మహాకవి శ్రీశ్రీ మాటల్లో..

b5d36717-0790-46bf-81ec-6ec3f793690a.jfif

03:25 pm: ప్రభుత్వ లాంఛనాలతో సూపర్‌స్టార్ కృష్ణకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

DSC_9788.jpg

03:25 pm: Murali Mohan: ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఫ్రంట్ బెంచ్‌లో ఇద్దరం కూర్చునేవాళ్లం

03:20 pm: Roja: తలకోనలో కృష్ణ గారు, శ్రీదేవి గారు వస్తే, నేను పరిగెత్తుకుంటూ షూటింగ్ చూడడానికి వెళ్ళాను

03: 15 pm: Jayasudha: ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే.. నేను ఆర్టిస్ట్‌ని అవుతానని ఆంటీ (విజయనిర్మల)కి చెప్పింది కృష్ణ గారే

03:10 pm: Mohan Babu: ‘అయ్యో ఏడుపు ఆపుకోలేకపోతున్నా’.. సూపర్‌స్టార్ కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేక కుమిలికుమిలి ఏడ్చిన మోహన్ బాబు

03:00 pm: తెలుగు రాష్ట్రాల నుంచి కృష్ణను కడసారి చూసేందుకు తరలివెళుతున్న అభిమానులు.. కృష్ణ నివాసంలోకి అభిమానులను అనుమతించకపోవడంతో ఆయన ఇంటి ముందు ఫ్యాన్స్ ఆందోళన

fans.jpg

02:55 pm: కృష్ణ నివాసానికి రాంచరణ్.. సూపర్‌స్టార్ పార్థివదేహానికి అంజలి ఘటించి మహేశ్‌ను ఓదార్చిన చరణ్

ram-charan.jpg

02:30 pm: కృష్ణ భౌతికదేహానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

* ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను

* అల్లూరి సీతారామరాజు సినిమాని చాలా సార్లు చూశాను అని చెప్తే.. కృష్ణ గారు చాలా నవ్వారు. మీరు సినిమాలు చూస్తారా అని.

kcr1.jpg

02:20 pm: కృష్ణ నివాసానికి చేరుకుని మహేశ్‌ను ఓదార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

kcr-mahesh.jpg

01:50 pm: హీరో కృష్ణ ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

01:40 pm: కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

vn1.jpg

* కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్, సినీ నటులు చిరంజీవి, వెంకటేష్, పవన్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, నాగచైతన్య, దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి, త్రివిక్రమ్, కొరటాల శివ

ktr.jpgchiranjeevi.jpgcbn1.jpg

01:33 pm: కృష్ణ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు

* కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు

* మహేశ్ బాబును ఓదార్చి ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత

cbn.jpg

01:00 pm: కృష్ణ హఠాన్మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ఇదే..

* కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్

* ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో మహేశ్ బాబుకు, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి

krishna-modi.jpg

12:40 pm: సూపర్‌స్టార్ కృష్ణ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్

* తెలుగు సినిమా సూపర్‌స్టార్, ఘట్టమనేని కృష్ణ ఇక లేరనే వార్త తెలిసి తీవ్రంగా చింతిస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్న రాహుల్

* నమ్ముకున్న రంగంలో వృత్తి పట్ల ఆయన చూపిన క్రమశిక్షణ, సాటిలేనిదని ప్రశంస

* కృష్ణ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు రాహుల్ ట్వీట్

https://twitter.com/RahulGandhi/status/1592405521029804032

krishna3.jpg

12:10 pm: సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు నేడు కాదు

* అభిమానుల సందర్శనార్ధం ఇవాళ రాత్రి గచ్చిబౌలి స్టేడియంలోనే ఆయన పార్థివదేహం

* రేపు ఉదయం స్టేడియం నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు భౌతికకాయం తరలింపు

* పద్మాలయ స్టూడియోస్‌లో కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక మధ్యాహ్నానికి మహాప్రస్థానానికి..

* కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వెల్లడి

krishna2.jpg

11:45 am: కాసేపట్లో నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయానికి కృష్ణ భౌతికకాయం

* అనంతరం అభిమానుల సందర్శనార్ధం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం

* అభిమానులు సందర్శించేలా స్టేడియంలో ఏర్పాట్లు

krishna1.jpg

11:30 am: సూపర్‌స్టార్ కృష్ణ అరుదైన ఫొటోల్లో ఇది ఒకటి..

krishna1.jpg

11:08 am: సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాప ప్రకటన విడుదల చేసిన ఆయన కుటుంబం

c48dcd1b-8ef4-442d-807e-437ce1e0dbf6.jfif

11:00 am: హీరో కృష్ణకు ప్రముఖుల నివాళులు.. వీక్షించడం కోసం కింది వీడియో క్లిక్ చేయండి

10:45 am: ట్విట్టర్‌లో అరుదైన ఫొటో పోస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ

Fhk1Z9PaYAEIAUh.jfif

10:20 am: ఏబీఎన్ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ఎన్నో మరపురాని విషయాలు పంచుకున్న సూపర్ స్టార్ కృష్ణ

10:00 am: అనంతరం అభిమానుల సందర్శనార్ధం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం

Krishna Birthday (19).jpg

09:15 am: నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయానికి కృష్ణ భౌతికకాయం

SMS_3469.jpg

09:00 am: కృష్ణ మృతికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం

* ప్రయోగాలకు పెద్ద పీట వేసి తెలుగు చిత్ర స్థాయిని పెంచారు: వెంకయ్య

DSC_0488.jpg

08:45 am: సూపర్ స్టార్ కృష్ణ మృతికి ప్రముఖుల సంతాపం

* సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తమిళిసై, బిశ్వభూషణ్, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్‌కల్యాణ్‌, లోకేష్, కేటీఆర్, రేవంత్‌రెడ్డి, శైలజానాథ్, సీపీఐ రామకృష్ణ, తులసిరెడ్డి, ఎలమంచలి శివాజీ

* కృష్ణ మృతికి సంతాపం తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు వేణుగోపాలకృష్ణ, తలసాని, ఎంపీలు రఘురామకృష్ణరాజు, కేశినేని శ్రీనివాస్, ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీడీపీ నేతలు సోమిరెడ్డి, కాసాని, రావుల, అర్వింద్‌కుమార్ గౌడ్, సీపీఐ నారాయణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, కృష్ణ మేకప్‌ మాన్ చేబ్రోలు మాధవరావు

08:30 am: కృష్ణ మృతికి నిర్మాతల మండలి సంతాపం

* ఎల్లుండి షూటింగ్‌లకు సెలవు ప్రకటించిన నిర్మాతల మండలి

krishna.jpg

08:15 am: ఏడాదికి 10 సినిమాలు.. 3 షిఫ్టుల్లోనూ పనిచేసిన కృష్ణ

* 1969లో ఒకే ఏడాది రికార్డు స్థాయిలో 19 కృష్ణ సినిమాలు విడుదల

* కృష్ణకు ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

* భారత ప్రభుత్వం ద్వారా పద్మభూషణ్‌ పురస్కారం

* గౌరవ డాక్టరేట్‌ అందించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం

* ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజుతో మల్టీస్టారర్‌ చేసిన కృష్ణ

* 1976లో కృష్ణకు నటశేఖర బిరుదు ప్రదానం

* కృష్ణకు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ 'లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌' అవార్డులు

* కృష్ణ పేరుతో పోస్టల్‌ స్టాంప్ విడుదల చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

* రాజీవ్‌గాంధీ ప్రోత్సాహంతో కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ

* కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఏలూరు నుంచి లోక్‌సభకు ఎన్నికైన కృష్ణ

* తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న సూపర్‌స్టార్‌ కృష్ణ

mosa.jpg

08:00 am: అల్లూరి సీతారామరాజు పాత్రతో సంచలనం సృష్టించిన కృష్ణ

* తెలుగు సినీపరిశ్రమలో అనేక సంచలనాలకు కృష్ణ శ్రీకారం

* తెలుగులో తొలి జేమ్స్‌బాండ్‌ సినిమా 'గూఢచారి 116'

* తొలి కౌబాయ్‌ సినిమా 'మోసగాళ్లకు మోసగాడు'

* తొలి సినిమా స్కోప్‌ 'అల్లూరి సీతారామరాజు'

* తొలి 70 ఎంఎం 'సింహాసనం' సినిమా తీసిన కృష్ణ

* పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, ఈనాడు, అగ్నిపర్వతం, పాడిపంటలు, తెలుగువీర లేవరా కృష్ణ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి

* సాహసమే ఊపిరిగా ఎదిగిన సూపర్‌స్టార్‌

16.jpg

07:40 am: 340కి పైగా సినిమాల్లో నటించిన సూపర్‌స్టార్ కృష్ణ

* 1965లో తేనెమనసులు సినిమాతో హీరోగా సినీరంగ ప్రవేశం

* అంతకు ముందు చిన్నచిన్న పాత్రలు చేసిన కృష్ణ

* గూఢచారి 116తో తారాపథంలోకి దూసుకుపోయిన కృష్ణ

* నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేతగా బహుముఖీన ప్రతిభ

* 1970లో పద్మాలయ స్టూడియో స్థాపించిన కృష్ణ

* 16 సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ

DSC_0473.jpg

07:30 am: కొంతకాలం క్రితం కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి, రెండో భార్య విజయనిర్మల, పెద్ద కుమారుడు రమేశ్‌బాబు మృతి

* కృష్ణ కుమారులు రమేశ్‌బాబు, హీరో మహేశ్‌బాబు

* కుమార్తెలు పద్మజ, మంజుల, ప్రియదర్శిని

* కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ

* 1943 మే 31న జన్మించిన సూపర్‌స్టార్ కృష్ణ

* కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం

mosagallaku mosagadu.jpg

07:20 am: తెల్లవారుజామున 4 గంటలకు కృష్ణ మరణించారు: డాక్టర్ గురు ఎన్‌.రెడ్డి

* ఆస్పత్రిలో చేరే సమయానికే కృష్ణ పరిస్థితి విషమంగా ఉంది

* సోమవారం రాత్రి 7 గంటలకు కృష్ణ పరిస్థితి మరింత విషమించింది: వైద్యులు

* కృష్ణకు మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరిగింది

* అందువల్లే మిగతా అవయవాలు పనిచేయలేదు: వైద్యులు

* చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదు: వైద్యులు

* మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కృష్ణ మృతి: వైద్యులు

* ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేశాం

* చివరి క్షణాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం: వైద్యులు

DSC_9788.jpg

07:00 am: సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ(80) కన్నుమూత

* హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

* తెల్లవారుజామున 4 గంటలకు కృష్ణ కన్నుమూత

* కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ

16.jpg

Updated Date - 2022-11-15T19:04:33+05:30 IST