Share News

IPL 2025: రిషభ్ పంత్ చేసిన ఆ తప్పు.. ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటే..

ABN , Publish Date - Mar 25 , 2025 | 06:09 PM

ఒక్క క్యాచ్ వదిలేస్తే మ్యాచ్‌ను దాదాపు వదిలేసినట్టే. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అలాంటి పరిస్థితే ఎదురైంది. విశాఖపట్నం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ జట్టుపై ఢిల్లీ టీమ్ అనూహ్య విజయం సాధించింది.

IPL 2025: రిషభ్ పంత్ చేసిన ఆ తప్పు.. ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటే..
Pant Misses the match stumping

టీ-20 క్రికెట్ అంటే వేగానికి మారు పేరు. మైదానంలో ఉన్న ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఆటగాళ్లు చేసే చిన్న తప్పు కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. ఒక్క క్యాచ్ వదిలేస్తే మ్యాచ్‌ను దాదాపు వదిలేసినట్టే. సోమవారం జరిగిన ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లో అలాంటి పరిస్థితే ఎదురైంది. విశాఖపట్నం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే (LSG vs DC). ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ జట్టుపై ఢిల్లీ టీమ్ అనూహ్య విజయం సాధించింది.


నిజానికి ఈ మ్యాచ్‌లో 14వ ఓవర్ వరకు మ్యాచ్ లఖ్‌నవూ చేతిలోనే ఉంది. ఏడు ఓవర్లకే సగం ఢిల్లీ జట్టు పెవిలియన్‌లో కూర్చుంది. అప్పటికి జట్టు స్కోరు కేవలం 66 పరుగులే. ఇక, లఖ్‌నవూ విజయం ఖాయం అనుకున్న దశలో అశుతోష్ శర్మ (66 నాటౌట్) బౌండరీలతో విరచుకుపడి ఢిల్లీ టీమ్‌ను గెలిపించాడు. అయితే చివరి ఓవర్లో ఢిల్లీ చివరి బ్యాటర్‌ మోహిత్‌ను స్టంపౌట్ చేసే అవకాశం లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్‌ (Rishabh Pant)కు వచ్చింది. షాబాజ్ లెగ్‌సైడ్ వేసిన బంతిని పంత్ పట్టుకోలేకపోయాడు. క్రీజు నుంచి చాలా దూరంగా ముందుకు వెళ్లిపోయిన మోహిత్‌ను పంత్ అవుట్ చేయలేకపోయాడు.


పంత్ ఆ స్టంపౌట్ చేసి ఉంటే ఢిల్లీ చివరి వికెట్ కూడా కోల్పోయి మ్యాచ్ ఓడిపోయి ఉండేది. అవుటయ్యే ప్రమాద నుంచి తప్పించుకున్న మోహిత్ రెండో బంతికి సింగిల్ తీసి అశుతోష్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతిని అశుతోష్‌ సిక్సర్‌గా మలిచి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. పంత్ చేసిన ఆ ఖరీదైన తప్పు కారణంగా ఢిల్లీ గెలిచేసింది. పంత్ మిస్ చేసిన ఆ స్టంపింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

GT vs PBKS: గుజరాత్ జట్టులో విపరాజ్ నిగమ్ లాంటి చిచ్చర పిడుగు.. తేలికగా తీసుకుంటే పంజాబ్‌కు మూడినట్లే


Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక


Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..


MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 06:09 PM