Superstar Krishna Health Update: సీనియర్ నటుడు కృష్ణకు గుండెపోటు.. వైద్యులు ఇంకా ఏం చెప్పారంటే..

ABN , First Publish Date - 2022-11-14T13:37:32+05:30 IST

తెలుగు సినీపరిశ్రమలో ‘నటశేఖర’గా వెలుగొందిన సూపర్‌స్టార్ కృష్ణ (Krishna) ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు మీడియాకు వివరాలను వెల్లడించారు. కృష్ణకు గుండెపోటు..

Superstar Krishna Health Update: సీనియర్ నటుడు కృష్ణకు గుండెపోటు.. వైద్యులు ఇంకా ఏం చెప్పారంటే..

హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమలో ‘నటశేఖర’గా వెలుగొందిన సూపర్‌స్టార్ కృష్ణ (Krishna) ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు మీడియాకు వివరాలను వెల్లడించారు. కృష్ణకు గుండెపోటు (Actor Krishna Heart Attack) వచ్చిందని వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై (Krishna On Ventilator) ఉన్నారని, చికిత్స అందిస్తున్నామని కాంటినెంటల్ ఆసుపత్రి డాక్టర్ (continental hospital Nanakaramguda) తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే (Krishna Health Critical) ఉందని వైద్యులు చెప్పారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్ చెప్పడంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కృష్ణ కోలుకుని క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. 24 గంటల తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఇప్పటి నుంచి ప్రతి గంట కూడా కీలకమేనని, ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఆయన స్పృహలో లేరని వైద్యులు తెలిపారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆయన గుండెపోటు నుంచి బయటపడేలా చేశామని, ప్రస్తుతం కాస్త నిలకడగానే ఉన్నా ఆందోళనకర పరిస్థితిగానే చెప్పక తప్పదని వైద్యులు పేర్కొన్నారు. కృష్ణ గుండెపోటుకు గురయిన విషయం తెలియడంతో ఆయన క్షేమంగా ఉండాలని ఘట్టమనేని అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.

Updated Date - 2022-11-14T14:29:03+05:30 IST