Real Bahubali Viral Video: తలపై బైక్‌ను పెట్టుకుని.. చేతులతో పట్టుకోకుండానే బస్సు పైకి ఎలా ఎక్కించాడో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2022-11-28T15:49:35+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మారుమూల ప్రాంతాల్లోని వ్యక్తుల ట్యాలెంట్‌కు గుర్తింపు దక్కుతోంది. తమ వృత్తి జీవితంలో భాగంగా పలు రంగాల వ్యక్తులు చూపే ప్రతిభ అందరికీ చేరుతోంది. బైక్ నెత్తి మీద పెట్టుకుని నిచ్చెన ఎక్కుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Real Bahubali Viral Video: తలపై బైక్‌ను పెట్టుకుని.. చేతులతో పట్టుకోకుండానే బస్సు పైకి ఎలా ఎక్కించాడో మీరే చూడండి..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మారుమూల ప్రాంతాల్లోని వ్యక్తుల ట్యాలెంట్‌కు గుర్తింపు దక్కుతోంది. తమ వృత్తి జీవితంలో భాగంగా పలు రంగాల వ్యక్తులు చూపే ప్రతిభ అందరికీ చేరుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బైక్ నెత్తి మీద పెట్టుకుని నిచ్చెన ఎక్కుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో (Real Bahubali Viral Video) సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. అతడు నిజమైన సూపర్ మ్యాన్ అని, రియల్ బాహుబలి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

@Gulzar_sahab అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. సాధారణంగా మోటర్ బైక్ చాలా బరువు ఉంటుంది. ఇద్దరు, ముగ్గురు కలిసి మోయడమే కష్టం. అలాంటిది ఈ వీడియోలో ఒక వ్యక్తి మోటర్‌బైక్‌ని తలపై పెట్టుకుని సునాయాసంగా మోసేశాడు. అంతేకాదు నెత్తి మీద ఉన్న బైక్‌ను చేతులతో పట్టుకోకుండానే బ్యాలెన్స్ చేస్తూ మెట్ల మీద నుంచి బస్సు పైకి ఎక్కాడు. శుక్రవారం షేర్ అయిన ఈ వీడియో ఇప్పటివరకు 89,000 వ్యూస్ దక్కించుకుంది. అలాగే 6,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది.

Updated Date - 2022-11-28T15:49:36+05:30 IST