Fifa World Cup: సాకర్ వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టేనా..? ప్రైజ్ మనీ ఎన్నికోట్లో తెలిస్తే..!
ABN , First Publish Date - 2022-11-21T14:12:13+05:30 IST
ఆదివారం రోజు తొలి మ్యాచ్ ముగిసిందో లేదో.. అప్పుడే FIFA World Cup విజేత ఎవరు? అనే అంశంపై నెట్టింట చర్చ మొదలైపోయింది. ఇంతలోనే Oxford కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాల ఆధారంగా ప్రపంచ విజేత ఎవరు? అనే విషయాన్ని తేల్చేసింది. అందుకు సంబంధించిన
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల కోసం మెగా టోర్నీ సిద్ధమైపోయింది. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ.. FIFA World Cup ఖతర్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తొలిపోరులో ఖతర్, ఈక్వెడార్ జట్లు తలపడ్డాయి. రెండు జట్ల మధ్య జరగిన హారాహోరీ పోరాటంలో 2-0 పాయింట్ల తేడాతో ఈక్వెడార్ ఖతర్‌పై విజయం సాధించింది. ఈ విషయం నిన్న మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన వాళ్లకు, వార్తలు చూసిన వారికి కూడా తెలుసు. అయితే.. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. ఆదివారం రోజు తొలి మ్యాచ్ ముగిసిందో లేదో.. అప్పుడే FIFA World Cup విజేత ఎవరు? అనే అంశంపై నెట్టింట చర్చ మొదలైపోయింది.
ఇంతలోనే Oxford కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాల ఆధారంగా ప్రపంచ విజేత ఎవరు? అనే విషయాన్ని తేల్చేసింది. అందుకు సంబంధించిన ప్రిడెక్షన్ టేబుల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం అది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బ్రెజిల్ మరోసారి వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంటుందని అంచనా వేడయంతో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో Oxford ప్రిడెక్షన్ టేబుల్‌ను ఒకసారి పరిశీలిస్తే..
32 దేశాలను ఎనిమిది గ్రూపులుగా విడగొట్టగా అందులో నెదర్లాండ్స్, ఇరాన్, అర్జెంటీనా, డెన్మార్క్, స్పెయిన్, క్రొయేషియా, బ్రెజిల్, ఉరుగ్వే దేశాలతోపాటు ఇంగ్లాండ్, ఈక్వెడార్, ఫ్రాన్స్, మెక్సికో, బెల్జియం, జర్మనీ, పోర్చుగల్, స్వట్జర్లాండ్ దేశాలు మాత్రమే మంచి మెరుగైన ప్రదర్శన ఇస్తాయట. మిగిలిన 16దేశాలు పేలవ ప్రదర్శనతో ఇంటి ముఖం పడతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్- ఇరాన్ దేశాల మధ్య జరిగే పోరులో నెదర్లాండ్ విజయం సాధిస్తుందని.. అలాగే.. అర్జెంటీనా-డెన్మార్క్ మధ్య జరిగే మ్యాచ్‌లో అర్జెంటీనా గెలుస్తుందని oxford prediction table చెబుతోంది. అంతేకాకుండా స్పెయిన్- క్రొయేషియా; బ్రెజిల్- ఉరుగ్వే మధ్య జరిగే పోరాటంలో వరుసగా స్పెయిన్, బ్రెజిల్ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధిస్తాయట.
ఇకపోతే ఇంగ్లాండ్-ఇక్వెడార్; ఫ్రాన్స్-మెక్సికో; బెల్జియం-జర్మనీ; పోర్చుగల్-స్విట్జర్‌లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌ల్లో వరుసగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, పోర్చుగల్ జట్లు విజయం సాధించనున్నట్టు అంచనా వేసింది. ఈ క్రమంలోనే నెదర్లాండ్ - అర్జెంటీనా; స్పెయిన్ - బ్రెజిల్; ఇంగ్లాండ్-ఫ్రాన్స్; బెల్జియం-పోర్చుగల్ దేశాలు క్వార్టర్ ఫైనల్‌లో తలపడనున్నట్టు వివరించింది. అనంతరం సెమీస్‌లో అర్జెంటీనా-బ్రెజిల్; ఫ్రాన్స్-బెల్జియం జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుదని తెలిపింది. అయితే ఈ సెమీ ఫైనల్స్‌లో బ్రెజిల్, బెల్జియం దేశాలు విజేతలు నిలిచి ఫైనల్‌కు చేరుకుంటాయట. ఫైనల్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగే భీకర పోరులో విశ్వవిజేతగా బ్రెజిల్ నిలుస్తందట. ఈ క్రమంలో బ్రెజిల్ నిజంగా FIFA World Cupను గెలుస్తుందా అంటే విశ్లేషకులు కూడా అవును అనే సమాధానమే చెబుతున్నారు. కానీ విజేత ఎవరు అనే విషయం తెలియాలంటే తుది పోరు వరకు వేచి చూడాల్సిందే.
అదే జరిగితే ఇది ఆరోసారి..
1930-2018మధ్య జరిగిన పోటీల్లో బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు FIFA World Cupను సొంతం చేసుకుంది. ఇటలీ, జర్మనీ దేశాలు నాలుగు సార్లు గెలుపొందగా.. ఫ్రాన్స్, అర్జెంటీనా, ఉరుగ్వే దేశాలు రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచాయి. ఇంగ్లాండ్, స్పెయిన్ మాత్రం చెరొక్కసారి కప్పును తమ దేశానికి పట్టుకెళ్లాయి. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఒక వేళ బ్రెజిల్ గనక ఈ పోటీల్లో గెలిస్తే.. ఫ్రైజ్ మనీ రూ.399కోట్లు గెలుచుకోవడంతోపాటు వరల్డ్ కప్‌ను ఆరుసార్లు సొంతం చేసుకున్న దేశంగా గుర్తింపు పొందుతుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టు మాత్రం రూ.242కోట్లతో ఇంటికెళ్తుంది.