Raichur: నీ వెంటే నేను.. మృత్యువులోనూ వీడని బంధం
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:42 PM
భార్య మృతిచెందిన మరుసటి రోజే భర్త కూడా మృతిచెందిన విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ దగ్గర జరిగింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అమరమ్మ అనే మహిళ గత ఆరు నెలలుగా అనారోగ్యంతో మంచానపడి గురువారం రాత్రి కన్నుమూసింది. అతి తెలుసుకున్న భర్త రాజశేఖర్ మానసికంగా కుంగిపోయి శుక్రవారం కన్నుమూశాడు. ఇద్దరి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

- అనారోగ్యంతో భార్య మృతి
- బాధతో.. మరుసటి రోజే భర్త కూడా..
రాయచూరు(బెంగళూరు): ఏడడుగుల బంధం ఏడు జన్మల బంధం అనేందుకు నిదర్శనంగా జిల్లాలోని మాన్వి తాలూకా కపగల్‌లో భార్య,భర్తల మరణం సంభవించింది. గంటల వ్యవధిలో ఇద్దరు మృత్యువాతపడడం గ్రామస్థులనే కాక చుట్టుముట్టు ఉన్న గ్రామస్థులను సహితం ఆశ్చార్యానికి గురి చేసింది. మాన్వి తాలూకా కపగల్(Kapagal)కు చెందిన అమరమ్మకు పక్షవాతం రాగా గత 6 నెలలుగా పక్షవాతంతో పోరాడుతూ గురువారం రాత్రి కన్నుమూసింది.
ఈ వార్తను కూడా చదవండి: Minister: మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి
భార్య కన్ను మూసిందన్న వార్త తెలుసుకున్న భర్త రాజశేఖర్(Rajashekar) మానసిక వేదనకు గురై శుక్రవారం తెల్లవారు జామున మృత్యువాతపడ్డాడు. దీంతో ఒక్కసారిగా గ్రామస్థులు దిగ్భారంతికి గురైయ్యారు. దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బంధువులతో కలిసి శుక్రవారం గ్రామంలో దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్ గద్దలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..
పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..
Read Latest Telangana News and National News