హార్దిక్‌కు టీ-20 పగ్గాలివ్వండి...

ABN , First Publish Date - 2022-11-15T02:13:23+05:30 IST

టీ20 ప్రపంచకప్‌ సెమీ్‌సలోనే భారత్‌ తిరుగుముఖం పట్టడంతో జట్టు ప్రక్షాళన జరగాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో జట్టు పగ్గాలను

హార్దిక్‌కు టీ-20 పగ్గాలివ్వండి...

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ సెమీ్‌సలోనే భారత్‌ తిరుగుముఖం పట్టడంతో జట్టు ప్రక్షాళన జరగాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో జట్టు పగ్గాలను హార్దిక్‌ పాండ్యాకు అప్పగించడం మేలని మాజీ ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అభిప్రాయపడ్డాడు. ‘రాబోయే టీ20 వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకుని జట్టు కెప్టెన్సీని హార్దిక్‌కు అప్పగిస్తే మంచిది. నేనే చీఫ్‌ సెలెక్టర్‌ అయితే అదే పనిచేసేవాణ్ణి. కివీ్‌సతో జరగబోయే సిరీ్‌సతోనే జట్టును సరికొత్తగా తయారుచేసుకోవాలి’ అని శ్రీకాంత్‌ సూచించాడు.

Updated Date - 2022-11-15T02:13:24+05:30 IST