Shadab Khan: షాహిద్ అఫ్రిది రికార్డును బ్రేక్ చేసిన షాదాబ్ ఖాన్
ABN , First Publish Date - 2022-11-13T19:17:31+05:30 IST
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ (Shadab Khan) ఓ రికార్డును తన ఖాతాలో

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ (Shadab Khan) ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో పాకిస్థాన్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)ని వెనక్కి నెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ (20) వికెట్‌ను పడగొట్టిన షాదాబ్ ఖాన్ టీ20ల్లో మొత్తంగా 98 వికెట్లు పడగొట్టాడు.
అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిద్ ఆఫ్రిది 97 వికెట్ల రికార్డును సమం చేసిన షాదాబ్ ఖాన్ ఈ మ్యాచ్‌తో అఫ్రిది రికార్డును బద్దలుగొట్టాడు. 24 ఏళ్ల షాదాబ్ 84వ మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఉమర్ గుల్ సాధించిన 85 వికెట్ల రికార్డును అఫ్రిది 98 మ్యాచుల్లో అధిగమించాడు. కాగా, పాక్ తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లలో షాదాబ్ ఖాన్, అఫ్రిది తర్వాతి స్థానంలో ఉమర్ గుల్ ఉన్నాడు. సయీద్ అజ్మల్ (85) వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా, హరీశ్ రవూఫ్ 70 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.