Italy: ఫిఫా ప్రపంచకప్‌కు ఇటలీ ఎందుకు దూరమైందంటే?
ABN , First Publish Date - 2022-11-26T19:17:12+05:30 IST
నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఇటలీ (Italy) ఈసారి ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup)లో కనిపించకపోవడం సగటు
ఖతర్: నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఇటలీ (Italy) ఈసారి ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup)లో కనిపించకపోవడం సగటు ప్రేక్షకుడిని నిరాశ పరిచింది. ప్రపంచకప్‌లో ఇటలీ కనిపించకపోవడం వరుసగా ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌కు అది ఎందుకు అర్హత సాధించలేకపోయిందో ఇప్పుడు చూద్దాం.
ఆశలు ఆవిరి..
* యూఈఎఫ్ఏ ప్రపంచకప్ క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-సిలో స్విట్జర్లాండ్, నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లిథువేనియాతో కలిసి డ్రా చేసుకుంది.
* నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రపంచకప్ కప్‌కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలం కావడంతో కోచ్ రాబర్టో మాన్సినీ, జట్టుపై ఒత్తిడి విపరీతంగా ఉంది.
* గతేడాది జరిగిన యూరోపియన్ చాంపియన్‌షిప్ నుంచి విరామం తీసుకోవడానికి ముందు నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లుథువేనియాతో జరిగిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది.
* టోర్నమెంటులో విజయం సాధించాక వరుసగా బల్గేరియా, స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. అంతకుముందు స్వదేశంలో లుథువేనియాతో జరిగిన మ్యాచ్‌లో 5-0తో విజయం సాధించింది.
దీంతో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అర్హత సాధించినట్టుగా కనిపించింది. అయితే, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా కావడంతో చివరి రౌండ్‌కు ముందు ఇరు జట్లు సమాన పాయింట్లతో నిలిచాయి.
* యూరో 2020 విజయం తర్వాత నాలుగు నెలలకు నార్తరన్ ఐర్లాండ్-ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రా అయింది. అదే సమయంలో బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ విజయం సాధించడంతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానానికి చేరుకుంది.
ఇటలీ ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ ఆశలు ఎలా అడుగంటాయి?
* నిర్ణయాత్మక ప్లే ఆఫ్ టైలో పోర్చుగల్‌తో తలపడాల్సిన ఇటలీ.. స్వదేశంలో నార్త్ మాసడోనియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో ఓటమి పాలు కావడంతో ఫైనల్స్‌ను కోల్పోయింది.
* నార్తరన్ మాసడోనియా ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ ఆ జట్టును 2-0తో ఓడించిన పోర్చుగల్ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంది.
మరి 2018 ప్రపంచకప్‌కు ఎందుకు క్వాలిఫై కాలేదు?
* 2018 ప్రపంచకప్ కోసం జరిగిన క్వాలిపికేషన్ రౌండ్ గ్రూప్-జిలో ఇటలీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
* 2017లో స్వదేశంలో స్వీడన్‌తో జరిగిన మ్యాచ్ 0-0తో డ్రా కావడంతో 60 సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది.