Bairi Naresh: బైరి నరేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ABN , First Publish Date - 2022-12-30T16:37:49+05:30 IST

నారాయణపేట జిల్లా కోస్గిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్పస్వామిపై బైరి నరేష్‌ (Bairi Naresh) అనే నాస్తికుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Bairi Naresh: బైరి నరేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

నారాయణపేట: నారాయణపేట జిల్లా కోస్గిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్పస్వామిపై బైరి నరేష్‌ (Bairi Naresh) అనే నాస్తికుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే నరేష్‌ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. నడిరోడ్డుపై బైరి నరేష్‌ అనుచరుడు శంకర్‌పై దాడి చేశారు. నరేష్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. బైరి నరేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నరేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ కోటిరెడ్డి (SP Kotireddy) హెచ్చరించారు. మనోభావాలను కించపరిచేలా మాట్లాడేవారిపై చర్యలు తప్పవని, శాంతికి విఘాతం కలిగించేవారిని సమావేశాలు పిలవొద్దని సూచించారు. బైరి నరేష్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కోటిరెడ్డి ప్రకటించారు.

Updated Date - 2022-12-30T16:37:51+05:30 IST