కవితకు భారత్‌ ముక్తి మోర్చా ఆహ్వానం

ABN , First Publish Date - 2022-12-22T03:00:12+05:30 IST

భారత్‌ ముక్తి మోర్చా 12వ వెనుకబడ్డ, మైనార్టీ వర్గాల ఉద్యోగుల ఫెడరేషన్‌ 39వ జాతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది.

 కవితకు భారత్‌ ముక్తి మోర్చా ఆహ్వానం

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): భారత్‌ ముక్తి మోర్చా 12వ వెనుకబడ్డ, మైనార్టీ వర్గాల ఉద్యోగుల ఫెడరేషన్‌ 39వ జాతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. ఈ మేరకు మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి విలాస్‌ ఖారత్‌ ఆహ్వానం అందించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో మోర్చా జాతీయ అధ్యక్షుడు వామన్‌ మేశ్రమ్‌ నేతృత్వంలో జాతీయ సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు కవిత అంగీకరించారు.

Updated Date - 2022-12-22T03:00:13+05:30 IST