Vijayashanti: ఇదా మహిళలకు మీరిచ్చే గౌరవం కేసీఆర్

ABN , First Publish Date - 2022-12-02T16:19:39+05:30 IST

Hyderabad: ఇన్‌చార్జి మేనేజరుగా ఉన్న ఓ మహిళ ఉన్నతాధికారి అనుమతితో నిజామాబాద్ జిల్లా మామిడి క్వారీకి చెందిన సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ కింద దరఖాస్తుదారుడికి ఇచ్చారు. దాని ఆధారంగా

Vijayashanti: ఇదా మహిళలకు మీరిచ్చే గౌరవం కేసీఆర్

Hyderabad: ఇన్‌చార్జి మేనేజరుగా ఉన్న ఓ మహిళ ఉన్నతాధికారి అనుమతితో నిజామాబాద్ జిల్లా మామిడి క్వారీకి చెందిన సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ కింద దరఖాస్తుదారుడికి ఇచ్చారు. దాని ఆధారంగా దరఖాస్తుదారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన శాఖాధిపతి మహిళా ఉద్యోగిని ఇన్‌చార్జి మేనేజరు బాధ్యతల నుంచి తొలగించారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR), సీఎస్, డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. ఈ ఉదంతంపై బీజేపీ(BJP)నాయకురాలు విజయశాంతి స్పందించారు. టీఆర్ఎస్ పాలనలో మహిళలకు ఏ పాటి గౌరవం దక్కుతుందో ఈ ఘటన అద్దంపడుతుందని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

విజయశాంతి పోస్టు యథాతథంగా...

‘‘మహిళలంటే కేసీఆర్ సర్కారుకి ఎంత గౌరవమో తాజాగా మీడియాలో వచ్చిన కథనం చూస్తే బాగా అర్ధమవుతుంది. ఆర్టీఐ కింద ఒక గనికి సంబంధించిన సమాచారాన్ని పై అధికారి అనుమతితోనే ఇచ్చినప్పటికీ ఆమెను ఏడేళ్లుగా వేధిస్తుండటమే గాక, రెండున్నరేళ్లుగా జీతం కూడా చెల్లించడం లేదు. ఈ బాధలు భరించలేక చివరికి వీఆరెస్ అడిగినా ఇవ్వకుండా ఆమెకు నరకం చూపిస్తున్నరు. ఈ సమస్యపై ఆ మహిళా అధికారి విమెన్ కమిషన్‌కు నివేదించినా దిక్కులేదు. అంతర్గత విచారణలో ఈ వేధింపులు నిజమేనని నిర్ధారణ అయినా... నిర్భయ చట్టం కింద కేసు నమోదై ఈ విషయం సాక్షాత్తూ సీఎం దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగకపోవడం ఘోరం. పైగా ఆమెపైనే తప్పుడు ఆరోపణలు చేసి, విచారణకు మహిళా అధికారిని నియమిస్తామని లేఖ ఇచ్చి అందుకు విరుద్ధంగా చేశారు. ముఖ్యమంత్రితో పాటు సీఎస్, డీజీపీ, డీవోపీటీకి సైతం ఈ విషయం తెలిసినా మిన్నకుండటం దారుణం. గవర్నర్‌నే లెక్క చెయ్యని ఈ సర్కారు నుంచి ఇంతకంటే న్యాయం ఆశించడం అత్యాశే అవుతుంది.’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

33 నెలలుగా జీతం ఇవ్వట్లే...

Updated Date - 2022-12-02T16:39:16+05:30 IST