తెలంగాణ ఏర్పాటులో గల్ఫ్ కార్మికుల పాత్ర కీలకం
ABN , First Publish Date - 2022-11-20T23:35:35+05:30 IST
తెలంగాణ ఏర్పా టులో గల్ఫ్ కార్మికుల పాత్ర కీలకమని ఎమ్మెల్సీ జీవ న్‌రెడ్డి అన్నారు.
సారంగాపూర్, నవంబరు, 20: తెలంగాణ ఏర్పా టులో గల్ఫ్ కార్మికుల పాత్ర కీలకమని ఎమ్మెల్సీ జీవ న్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేక రుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందని కా ర్మికులు భావించారన్నారు. రాజకీయాలకు అతీతం గా పెద్ద ఎత్తున్న ఉద్యమ కార్యక్రమాలు ని ర్వహించి తెలంగాణ ఏర్పాటులో గల్ఫ్ కార్మికులు కీలక పాత్ర పోషించారని వారి కృషిని కేసీఆర్ మరిచారని ఎమ్మె ల్సీ విమర్శించారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు లబించకనే యువత గల్ఫ్ బాట పడుతున్నారని అ న్నారు. గతంలో 10శాతం ఉంటే ప్రస్తుతం 15శాతం యువత గల్ఫ్ బాట పట్టారని తెలిపారు. గల్ఫ్ కార్మి కులు మృతి చెందితే వారి కుటుంబాలను ఆదుకు నేందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో రూ, లక్ష ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఎన్నికల సమ యంలో గల్ఫ్ కార్మికుల మద్దతు పొందడానికి కేసీ ఆర్ రూ, 5లక్షలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేశారన్నారు. వెంటనే గ ల్ఫ్ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గల్ఫ్‌లో మృతి చెందిన బీర్పూర్ మండలానికి చెందిన అల్లెపు నర్సిం గ్ కుటుంబాన్ని పరామర్శించాడు. ఆకుటుంబాన్ని ఆ దుకునేందుకు కలెక్టరు చొరవతీసుకుని మృతుడి భా ర్యకు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. దుబాయ్‌లో న ర్సింగ్ పనిచేస్తున్న కంపెనీ నుంచి ఆర్థిక సాయం ఇ ప్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీర్పూర్ ఎంపీపీ మ సర్థి రమేష్, రెండు మాండలాల అధ్యక్షులు రాంచం దర్‌రెడ్డి, సుబాష్, సీనియర్ నాయకులు గుడిసే జి తేందర్ యాదవ్, ఆకుల రాజిరెడ్డి, కాలగిరి సత్యనా రాయణ రెడ్డి పాల్గొన్నారు.