వైసీపీది రాజకీయ కక్ష

ABN , First Publish Date - 2023-09-23T00:24:05+05:30 IST

వైసీపీ రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీది రాజకీయ కక్ష
మాట్లాడుతున్న జేసీ దివాకర్‌రెడ్డి,

వైసీపీది రాజకీయ కక్ష: జేసీ బ్రదర్స్‌

యాడికి, సెప్టెంబరు 22: వైసీపీ రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో టీడీపీ నాయకులు చవ్వా గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పెద్దఎత్తున దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న జేసీ సోదరులు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడం వైసీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. 14సంవత్సరాలుగా సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. సైకో పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. దీక్షలో క్లాస్‌-1 కాంట్రాక్టర్‌ చవ్వా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలను అణచివేయడానికే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. శిబిరంలో దాదాపు 1500మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన తాడిపత్రి ఇనచార్జ్‌ శ్రీకాంతరెడ్డి, యాడికి మండల అధ్యక్షులు సునీల్‌కుమార్‌, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, సీసీఐ నాయకులు వెంకటరాముడు, మహమ్మద్‌రఫీ, వడ్డె రాముడు, విజయలక్ష్మి, పరిమి చరణ్‌, నాగముని రెడ్డి, కులశేఖర్‌నాయుడు, బొట్టు శేఖర్‌, మాదాల అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:24:05+05:30 IST