AP Cabinet: ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లుకు కేబినెట్ ఆమోదం.. ఏపీ కేబినెట్‌ మరిన్ని నిర్ణయాలు ఇవే..

ABN , First Publish Date - 2023-06-07T14:08:22+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఏపీ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP Cabinet: ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లుకు కేబినెట్ ఆమోదం.. ఏపీ కేబినెట్‌ మరిన్ని నిర్ణయాలు ఇవే..

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) అధ్యక్షతన జరుగుతున్న ఏపీ మంత్రి వర్గ సమావేశంలో (Ap Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లును జగవ్ సర్కార్ తీసుకొచ్చింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28న అమలుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్‌కు కెబినెట్ అనుమతి ఇచ్చింది.

కేబినెట్ నిర్ణయాలు...

  • ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం

  • ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్‌ ఆమోదం

  • కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం

  • 2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు

  • గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం

  • రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలల కు 706 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

  • చిత్తూరు డైరీ ప్లాంట్ కు చెందిన 28 ఎకరాల భూమినీ లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం

  • ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు అనుమతి ఇచ్చిన కేబినెట్

  • జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణకు కేబినెట్ ఆమోదం

  • పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కేబినెట్ ఆమోదం

Updated Date - 2023-06-07T16:16:39+05:30 IST