AP Politics : వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు.. ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-16T16:20:50+05:30 IST
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘విశాఖ బీసీ గర్జన’ (Visakha BC Garjana) జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య (R Krishnaiah) , ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జీ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) , మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఇతర వైసీపీ బీసీ నేతలు (YSRCP) హాజరయ్యారు..
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘విశాఖ బీసీ గర్జన’ (Visakha BC Garjana) జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య (R Krishnaiah) , ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జీ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) , మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఇతర వైసీపీ బీసీ నేతలు (YSRCP) హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) రాజకీయనాయకుడు కాదు.. సంఘ సంస్కర్త. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకొనే విధంగా జగన్ కృషి చేస్తున్నారు. అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెనలు పెట్టి.. విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విధంగా చేశారు. చరిత్ర ఉన్నన్ని రోజులూ జగన్ పేరు నిలిచిపోతుంది. ఏపీలో కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలు కంటే.. మన రాష్ట్రంలోనే బీసీల బతుకులు బాగున్నాయి. అన్ని రంగాల్లో బీసీల వాటా బీసీలకు దక్కాలి.. అయితే వాటా కంటే ఎక్కువగానే ఏపీలో బీసీలకు దక్కుతోంది. జగన్‌ది బీసీ సంక్షేమ ప్రభుత్వం.. బీసీలంతా జగన్‌కు అండగా నిలవాలి. పేదలకు రాజ్యాధికారం కోసమే.. నన్ను రాజ్యసభకు పంపారు’ అని కృష్ణయ్య వ్యాఖ్యానించారు.
చికిత్స చేసింది వైఎస్సే..!
ఇదే సభలో మంత్రి మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. బీసీ నేత ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపిన ఘనత జగన్‌దే అన్నారు. ‘బీసీలకు ఒక రోగం ఉంది.. అది పేదరికం. ఈ రోగానికి చికిత్స చేసింది.. డా వైయస్ రాజశేఖరరెడ్డి. బీసీల కోసమే జగన్ ప్రభుత్వం వచ్చింది.. ఎవరూ ఊహించని విధంగా పథకాలు ప్రవేశపెట్టారు. నాకు, కృష్ణయ్యకు పదవులు వచ్చాయంటే జగన్ చలువే. జగన్ వలన శాశ్వత బీసీ కమిషన్ వచ్చింది.. బిసీ కులగణన జరగాలి. బీసీలు ముఖ్యమంత్రి అయినా.. జగన్ లాగా బీసీలను అభివృద్ధి చేయలేరు’ అని మంత్రి వేణు చెప్పుకొచ్చారు.