Chandrababu: జగన్‌రెడ్డి సర్కార్‌పై చంద్రబాబు విమర్శలు

ABN , First Publish Date - 2023-06-06T20:33:19+05:30 IST

జగన్‌రెడ్డి (CM Jagan) సర్కార్‌పై టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) విమర్శలు గుప్పించారు.

Chandrababu: జగన్‌రెడ్డి సర్కార్‌పై చంద్రబాబు విమర్శలు

అమరావతి: జగన్‌రెడ్డి (CM Jagan) సర్కార్‌పై టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) విమర్శలు గుప్పించారు. ప్రతిరోజూ టీడీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేస్తేనో, అడ్డుకుంటేనో తప్ప జగన్‌ సర్కార్‌కు పొద్దు గడవడం లేదని విమర్శించారు. నిన్న ఎమ్మెల్యే స్వామిని అరెస్ట్ పేరుతో హింసించారని, నేడు ఎమ్మెల్యే నిమ్మలను అరెస్ట్ చేసి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమంటే ప్రశ్నించే గొంతులను నిర్బంధించడం కాదన్నారు. ఈ నియంతృత్వ పాలకులు తెలుసుకోవాలని సూచించారు.

Updated Date - 2023-06-06T20:33:19+05:30 IST