Atchannaidu: హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా జగన్ ప్రవర్తించారు

ABN , First Publish Date - 2023-04-06T19:27:33+05:30 IST

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)పై ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) విమర్శలు గుప్పించారు.

Atchannaidu: హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా జగన్ ప్రవర్తించారు

అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)పై ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) విమర్శలు గుప్పించారు. సీతారాముల కల్యాణానికి సీఎం దంపతులు వెళ్లడం ఆనవాయితీ అని, కాలు బెణికిందన్న సాకుతో సీఎం జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చిలకలూరిపేట కార్యక్రమాల్లో జగన్ చకచకా నడుచుకుంటూ వెళ్లారని, జగన్‌ వేరే మతాన్ని ఆచరించొచ్చని,.. సీఎం హోదాలో ఒంటిమిట్ట వెళ్లవచ్చుకదా అని ఆయన ప్రశ్నించారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా జగన్ ప్రవర్తించారని, వైసీపీలో ఇబ్బందులు, ప్రజావ్యతిరేకతతో ధర్మాన బ్యాలెన్స్ తప్పారని, మగవాళ్లు పోరంబోకులు అని మంత్రి ధర్మాన అన్నారని, 'జగన్, ధర్మాన కూడా మగాళ్లే కదా.. వాళ్లూ పొరంబోకులేనా..?' అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, టచ్‌లో ఉండటమే కాకుండా ఎదురు తమకే ఆఫర్లు ఇస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఒకరికి సీటు ఇస్తే.. నలుగురం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని, వైసీపీలో ఉంటే భవిష్యత్ ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమైందని అచ్చెన్నాయుడు అన్నారు. ఎమ్మెల్యేలు అంటే జగన్కు గౌరవం లేదని, జగన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఎమ్మెల్సీ ఎన్నికలతో జగన్ మనస్తత్వం అర్థమైపోయిందని అచ్చెన్న విమర్శించారు.

Updated Date - 2023-04-06T19:30:50+05:30 IST