వరసిద్ధుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2023-04-14T01:55:21+05:30 IST

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని గురువారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు.

వరసిద్ధుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తికి జ్ఞాపికను అందిస్తున్న చైర్మన్‌ మోహన్‌రెడ్డి

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్‌ 13: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని గురువారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వారిని వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్‌రెడ్డి కూడా స్వామి సేవలో పాల్గొన్నారు.

Updated Date - 2023-04-14T01:55:21+05:30 IST