పింఛన్ల పంపిణీపై కేంద్ర బృందం తనిఖీలు

ABN , First Publish Date - 2023-01-20T00:23:08+05:30 IST

మండలంలో పింఛన్ల పంపిణీపై కేంద్ర బృందం అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

పింఛన్ల పంపిణీపై కేంద్ర బృందం తనిఖీలు
పింఛన్‌ పొందుతున్న మహిళతో మాట్లాడుతున్న ఎన్‌ఐఆర్డీ అధికారి కిరణ్‌ దేవ్‌

పాలసముద్రం, జనవరి 19: మండలంలో పింఛన్ల పంపిణీపై కేంద్ర బృందం అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ కిరణ్‌దేవ్‌ ఆధ్వర్యంలో ఆముదాల, కృష్ణజిమ్మాపురం, పాలసముద్రం, వనదుర్గాపురం సచివాలయాల పరిధిలోని 83 మంది లబ్ధిదారులను కలిసి మాట్లాడారు. పింఛన్‌ సొమ్ము ఇచ్చే సమయంలో సిబ్బంది లంచాలు అడుగుతున్నారా? అని ఆరా తీశారు. పంపిణీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో విద్యావతితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పింఛన్‌ పంపిణీ రికార్డులను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చిన విషయం తెలుసుకుని జిల్లా అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారులతోనే మాట్లా డించారు. ఎన్‌ఐఆర్డీ డేటా కలెక్షన్‌ అధికారులు జగదీష్‌, హరి, ఈవోపీఆర్డీ రమేష్‌, పంచాయతీ కార్యదర్శులు నరేష్‌, సుధాకర్‌, జయశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-20T00:23:51+05:30 IST