మరో ప్రయోగానికి ఇస్రో సన్నాహం
ABN , First Publish Date - 2023-05-07T02:41:19+05:30 IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో జీఎ్‌సఎల్‌వీ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది.

’సూళ్లూరుపేట, మే 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో జీఎ్‌సఎల్‌వీ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స-1జే (నావిక్) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ రాకెట్ అమర్చే విడి భాగాల సామగ్రి శనివారం తమిళనాడు ఇస్రో సెంటర్ మహేంద్రగిరి నుంచి రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ షార్‌కు చేరింది. ఇప్పటికే రాకెట్ మొదటి అనుసంధాన పనుల్లో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. సోమవారం నుంచి ఈ విడి భాగాలను అమర్చనున్నారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఈ నెలాఖరులో ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒక ప్రయోగం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆ దిశగా షార్ నుంచి ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.