Chittoor Dist: కుప్పంలో ఎంపీ, ఎమ్మెల్సీకి నిరసన సెగ
ABN , First Publish Date - 2023-09-07T14:38:39+05:30 IST
చిత్తూరు: జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులకు నిరసనలు ఎదురవుతున్నాయి. షిర్డి రైలు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌ను స్థానిక ప్రజలు ప్రశ్నలతో నిలదీశారు. ఎన్నికల కోసం హామీలిచ్చి అమలు చేయడం మరిచారని మహిళలు ఇద్దరినీ ప్రశ్నించారు.
చిత్తూరు: జిల్లాలో వైసీపీ (YCP) ప్రజా ప్రతినిధులకు నిరసనలు ఎదురవుతున్నాయి. షిర్డి రైలు (Shirdi Train) ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ రెడ్డెప్ప (MP Reddappa), ఎమ్మెల్సీ భరత్ (MLC Bharat)ను స్థానిక ప్రజలు ప్రశ్నలతో నిలదీశారు. ఎన్నికల కోసం హామీలిచ్చి అమలు చేయడం మరిచారని మహిళలు ఇద్దరినీ ప్రశ్నించారు. గ్రామాల్లో, మునిసిపాల్టీల్లో ఎక్కడా చిన్న చిన్న పనులు కూడా జరగడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు ప్రారంభోత్సవానికి ఎంపీ వస్తున్నారన్న సమాచారంతో కుప్పం 13వ వార్డుకు చెందిన మహిళలు అక్కడకు వచ్చి ఆయనను నిలదీశారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ భరత్ కలగజేసుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక ఎంపీ, ఎమ్మెల్సీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.