CPI Narayana : అదానీ ఎందుకు వస్తున్నారు?
ABN , First Publish Date - 2023-04-11T15:40:59+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
ఢిల్లీ : విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వం తీసుకుంటే పబ్లిక్ సెక్టార్‌గా మారుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ కొంటే నష్టం ఉండదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 30 వేల ఎకరాల భూమి ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దొంగ చేతికి ఇచ్చినా కూడా 3 లక్షల కోట్ల రూపాయలు వస్తాయన్నారు. అదానీ ఎందుకు వస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకుంటే దాన్ని స్క్రాప్ కింద అమ్మేస్తారన్నారు.. లేదంటే స్వాధీనం చేసుకొని డంపింగ్ యార్డ్ కింద అదానీ మార్చుకుంటారని విమర్శించారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులకు దగ్గరగా 30 వేల ఎకరాలు ఎక్కడ దొరకదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి బానిసగా మారిపోయారన్నారు. అదానీకి అనుకూలంగా ఉండకపోతే జగన్‌ను జైల్లో పెడతారన్నారు. అదానీకి అనుకూలంగా లేకపోతే అమిత్ షా ఊరుకోడన్నారు. తాను విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ తీసుకుంటానంటే జగన్ మరుసటి రోజు జైల్లో ఉంటాడని నారాయణ పేర్కొన్నారు.