హింసను ప్రేరేపిస్తున్న మత్తు పదార్థాలను నిషేధించాలి

ABN , First Publish Date - 2023-08-02T01:29:00+05:30 IST

సమాజంలో మహిళలపై నిత్యం జరుగుతున్న హింసను ప్రేరేపిస్తున్న మద్యం, ఇతర మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి డిమాండ్‌ చేశా రు.

హింసను  ప్రేరేపిస్తున్న మత్తు పదార్థాలను నిషేధించాలి
మహిళలపై హింసకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో నిరసన దృశ్యం

ఐద్వా డిమాండ్‌

కాకినాడలో పోరుయాత్ర

కాకినాడ క్రైం, ఆగస్టు 1: సమాజంలో మహిళలపై నిత్యం జరుగుతున్న హింసను ప్రేరేపిస్తున్న మద్యం, ఇతర మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి డిమాండ్‌ చేశా రు. హింసకు వ్యతిరేకంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో హింసపై రాష్ట్రవ్యాప్త పోరుయాత్ర గత నెల 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి మంగళవారం కాకినాడకు చేరుకుంది. ఈ యాత్రకు జడ్పీ కూడలి వద్ద ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలు ఘన స్వా గతం పలికారు. అక్కడ నుంచి యాత్ర ఇంద్రపాలెం అంబేడ్కర్‌ విగ్రహకూడలికి చేరుకుంది. ఐద్వా ప్రతినిధులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీ ఐడియల్‌ కళాశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా పటిష్టంగా అమలు జరగకపోవడం వల్ల మహిళలపై హింస పెరిగిపోతోందన్నారు. మహిళల రక్ష ణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటుచేయాలన్నారు. పోర్న్‌ వెబ్‌సైట్లను నిషేధించాలన్నారు. తర్వాత కళారూపాలను ప్రదర్శించారు. ఐద్వా నుంచి కె.నాగజ్యోతి, భూలక్ష్మి, భవానీ, పద్మ, నాగదేవి, ఫాతిమా, ఎస్‌ఎఫ్‌ఐ నుంచి గంగా సూరిబాబు, టి.రాజా, జమాతే హిందూ ఇస్లాం ప్రతినిధి సిద్వి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T01:29:00+05:30 IST