అంతర్వేది ఆలయానికి మహర్దశ
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:35 AM
అంతర్వేది ఆలయానికి మహర్దశ రానుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు.

అంతర్వేది, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): అంతర్వేది ఆలయానికి మహర్దశ రానుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మం గళవారం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనం తరం ఆయన ఆలయ అధికారులు, స్థానిక నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా స్వామివారి దేవస్థానం బకాయిలు వసూలు, శిస్తు పెంపుదలపై చర్చించారు. అంతర్వేదికి వచ్చే రహదారులను వెడల్పు చేయడం, ఆలయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌తో పాటు అనుబంధ ఆలయమైన పార్వతీ సమేత నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం తదితర పలు అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం ఆలయం వద్ద దేవదాయశాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఏసీ వి.సత్యనారాయణ, దిరిశాల బాలాజీ, ముప్పర్తి నాని, పోతురాజు శ్రీవెంకటకృష్ణ, బైరా నాగరాజు, గుబ్బల ఫణికుమార్, ఉండపల్లి అంజి, పోతురాజు సురేష్, పొన్నాల ప్రభ, బర్రే శ్రీను తదితరులు పాల్గొన్నారు.