కూత.. మోత!

ABN , First Publish Date - 2023-10-01T01:28:45+05:30 IST

టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో శనివారం రాత్రి టీడీపీ శ్రేణులతోపాటు పౌరులు చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమం హోరెత్తిపోయింది.

కూత.. మోత!
రామచంద్రపురం మండలం చోడవరంలో తన నివాసం వద్ద ఈల ఊదుతూ నిరసన వ్యక్తంచేస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అనంతకుమారి

జిల్లాలో హోరెత్తిన మోతమోగిద్దాం కార్యక్రమం

ఐదు నిమిషాలపాటు ఎక్కడికక్కడ విజిల్స్‌, డప్పు, కంచాల మోత

టీడీపీ శ్రేణులతోపాటు ప్రజలూ స్వచ్ఛందంగా మోత మోగించారు

అమలాపురం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో శనివారం రాత్రి టీడీపీ శ్రేణులతోపాటు పౌరులు చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమం హోరెత్తిపోయింది. అమలాపురంలో రెండుచోట్ల, రాజోలు, రావులపాలెం, పి గన్నవరం, మండపేట, ముమ్మిడివరం, రామచంద్ర పురం తదితర మండలాల్లో ప్లేట్లను కొడుతూ ఈలలు వేస్తూ హారన్లు మోగిస్తూ అయిదు నిమిషాలపాటు హోరెత్తించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు చేసిన సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గరిటెలతో కంచాలు కొట్టి..

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 30: తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినిపించేలా శనివారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో మోత మోగిద్దాం కార్యక్రమా న్ని నిర్వహించారు. పట్టణ పరిసర గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు మహిళలు, పిల్లలు, పెద్దసంఖ్యలో బయటకొచ్చి కంచాలు, గరిటెలతోపాటు బూరలు ఊది డప్పులు కొట్టి మోత మోగించారు. అమ లాపురం గడియార స్తంభం సెంటర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి మెట్ల రమణబాబు, జిల్లా ప్రధాన కార్య దర్శి అల్లాడ సోంబాబు, తెలుగు మహిళ జిల్లా అధ్య క్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారి బాబ్జి, బొక్కా శ్రీహరి, గుబ్బల నాగేశ్వరరావు, దాసం గోపి, రాయుడు ఈశ్వరరావు, బొక్కా శ్రీను, మంద గెద్దయ్య, బొర్రా ఈశ్వరరావు, వలవల శివరావు తదితరులు పా ల్గొన్నారు. టీడీపీ పార్లమెంటు ఇన్‌చార్జి గంటి హరీష్‌ మాధుర్‌ ఆధ్వర్యంలో అమలాపురం నల్లవంతెన వద్ద కంచాలు, గ్లాసులతో మోత మోగిస్తూ పెద్దఎత్తున నినా దాలు చేశారు. కార్యక్రమంలో పోతుల సుభాష్‌చంద్ర బోస్‌, బత్తుల ప్రసాద్‌, వర్మ తదితరులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్‌ ఆశెట్టి ఆదిబాబు ఆధ్వర్యంలో 2వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఆశెట్టి నాగదుర్గ, చింతలపూడి సత్తిబాబు, దేశినీడి శ్రీనివాస రావు, షేక్‌ మస్తాన్‌, యాళ్ల బాబ్జి పాల్గొన్నారు. అమ లాపురం రూరల్‌ మండలం బండారులంకలో వీధి వీధినా టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కంచాలు, గ్లాసులతో మోత మోగించారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్‌ ఆధ్వర్యంలో చినచంద్రపురం మురుగులమ్మ గుడి సెంటర్‌, మాడ వీధి, వీరభద్రపురం సెంటర్‌, పాతబండారులంక తది తర ప్రాంతాల్లో మోత మోగించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చింతా శంకరమూర్తి, సొసైటీ మాజీ అధ్యక్షుడు పుత్సల వరదరాజులు, నాయకులు కాశిన బాబి, మాడా మాధవి, బళ్ల శ్రీనివాసచక్రవర్తి, కొండా శ్రీను, గోళ్ల మల్లేశ్వరరావు, ఆశపు చిన్ని, కొండా రాజు, కొండా రామలింగం, బండి సుబ్బారావు, వాసా భీమ శంకరం, ఈతకోట రాజేష్‌, చింతా ఉమా తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు బట్టు పండు, బండి మణికంఠ తదితరులు సంఘీభావం తెలిపారు.

బాబును కడిగిన ముత్యంలా బయటకు పంపించు స్వామీ..

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 30: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు స్వగృహం వద్ద చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 18వ రోజుకు చేరు కున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు ఆధ్వ ర్యంలో శెట్టిబలిజ సంఘీయులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుని విగ్రహానికి పూజలు నిర్వహించి చంద్రబాబును కడిగిన ముత్యంలా బయటకు పంపించాలని వేడుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మిల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు సహా నేతలు సాష్టాంగ ప్రణామాలు చేశారు. దెందుకూరి సత్తిబాబు రాజు, మల్లుల పోలయ్య, తిక్కిరెడ్డి నేతాజీ, కడలి వెంకటేశ్వరరావు, గుత్తుల నాగేశ్వర రావు, చొల్లంగి సత్యసాయిబాబా, వాసంశెట్టి జగదీష్‌, కాండ్రేగుల వాణీఅచ్యుతం, గెద్దాడ శ్రీను, పేరూరి విజయలక్ష్మి పాల్గొన్నారు.

రావులపాలెంలో శీర్షాసనం వేసి నిరసన

రావులపాలెం, సెప్టెంబరు 30: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం తలకిందులు అవ్వడంతో ప్రజలు అతలాకుతలం అయ్యే పరిస్థితి ఏర్పడిందని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ సత్యానందరావు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 18 రోజుకు చేరుకున్నాయి. శనివారం క్లస్టర్‌ ఆరు పరిధిలోని నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు ఆధ్వర్యంలో జగన్‌ పాలనలో రాష్ట్రంలో తలకిందులైందంటూ శీర్షాసనం వేసి వినూత్న నిరసన తెలిపారు. అనంతరం బండారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏముందో చెప్పే పరిస్ధితి ఆ పార్టీ నాయకులకే లేదన్నారు. దీనికి నిదర్శనం ప్రజల్లోకి వెళ్లినప్పుడు వైసీపీ నాయకులు గురవుతున్న అవమానాలను సోషల్‌ మీడియాలో చూస్తూనే ఉంటున్నామన్నారు. ఈ దీక్షకు నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ సంఘీబావం తెలిపారు.

మోత మోగించారు!

రాత్రి 7 నుంచి 7.05 వరకు కంచాలు, విజిల్స్‌, డప్పుల మోత

కార్యక్రమం విజయవంతం చేసిన టీడీపీ శ్రేణులు

ముమ్మిడివరం, సెప్టెంబరు 30: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నారా బ్రాహ్మణి ఇచ్చిన పిలుపుమేరకు మోతమోగిద్దాం కార్యక్రమాన్ని శనివారం రాత్రి పార్టీ శ్రేణులు నిర్వహించారు. ముమ్మిడివరం పోలమ్మచెరువుగట్టున నందమూరి తారకరామారావు విగ్రహంవద్ద టీడీపీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్‌చార్జి దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో శనివారం రాత్రి కంచాలు, గరిటెలు విజిల్స్‌, డప్పుల ద్వారా మోత మోగించారు. పోలమ్మచెరువు నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, అరదాని శ్రీనివాస్‌, దొమ్మేటి రమణకుమార్‌, తాడి నరసింహారావు, సాగిరాజు సూరిబాబురాజు, చిక్కాల అంజిబాబు, పిల్లి నాగరాజు, బొక్కా రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, కుడుపూడి మల్లేశ్వరి, బొంతు నాగరాజు, నడింపల్లి శ్రీనివాసరాజు, మల్లాడి రాంబాబు పాల్గొన్నారు.

రావులపాలెం: రావులపాలెంలో శనివారం రాత్రి మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్‌రాజు, మండల శాఖ అధ్యక్షుడు గుత్తులపట్టాభి రామారావుతో పాటు టీడీపీ శ్రేణులు రావులపాలెంలో కంచాలు, ప్లేట్లపైశబ్ధాలు చేస్తూ చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కార్యక్రమాన్ని చేశారు.

అర్ధనగ్నంగా టీడీపీ శ్రేణుల నిరసన

అల్లవరం: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అల్లవరం మండల టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు అర్ధనగ్నంగా పళ్లాలు, డబ్బులు కొట్టి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు తన స్వగృహాం వద్ద కంచం వాయిస్తూ నిరసన తెలిపారు. తుమ్మలపల్లిలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా తెలుగుమహిళా నేత, సర్పంచ్‌ వడ్డి సుభాషిణి ఆధ్వర్యంలో కంచాలు వాయిస్తూ నిరసన తెలిపారు. శెట్టిబలిజ సాధికారత రాష్ట్ర డైరెక్టర్‌ కడలి వెంకటేశ్వరరావు, మామిడిశెట్టి శ్రీరామ్‌, రాసూరి రాంబాబు, వాసంశెట్టి వీరబాబు, గోసంగి సత్యనారాయణ, ఆకుల బాబి, ఎం.జయరామ్‌, దొమ్మేటి సత్యనారాయణ, బొర్రా రాజేష్‌, తదితరులు అల్లవరం పార్టీ కార్యాలయంవద్ద నిరసన తెలిపారు.

గ్రామాల్లో మోతమోగిద్దాం కార్యక్రమం

కె.గంగవరం: తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు మోతమోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7నుంచి 7.05 నిమిషాల వరకూ విజిల్స్‌ వేస్తూ, డప్పులు వాయిస్తూ, ప్లేటు గరిటతో శబ్ధం చేస్తూ నిరస న తెలిపారు. అముజూరులో పార్టీ మండల అధ్యక్షుడు మరివాడ చిన్నికృష్ణ, పాణింగపల్లిలో నాయకులు, సత్యవాడలో క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ సలాది రమేష్‌, శివలలో తెలుగురైతు అధ్యక్షుడు బలుసు శివప్రసాద్‌, కుందూరులో జగతా రమణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

రాయవరం: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసగా నారా బ్రాహ్మాణిపిలుపు మేరకు రాయవరం మండలంలోని 12 గ్రామాల్లో మోత మోగిద్దాం కార్యక్రమం శనివారంరాత్రి నిర్వహించారు. చెల్లూరు, సోమేశ్వరం, మాచవరం గ్రామాల్లో టీడీపీ నేతలుతో పాటు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు విజిల్‌ మోగించడంతో పాటు కంచాలు, గరిటేలతో కంచాలపై మోగించడం, డప్పు కొట్టడం పాటు పలువురు రోడ్లపై ఆగి హారన్‌ మోగించి నిరసన తెలిపారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అమలాపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు వైఆర్కే పరమహంస, కోడి చిన్న అప్పారావు, మేడపాటి రవీంద్రారెడ్డి, చుండ్రు వీర్రాజు, దేవు వెంకట్రాజు, మాజీ సర్పంచ్‌ రాజ్‌కుమార్‌, మురకొండ విజయ దుర్గారావు,తదితరులు పాల్గొన్నారు.

అలమూరు: మండల టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో మోతమోగిద్దాం కార్యక్ర మం నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌ సెంటర్లో ఎన్టీఆర్‌ విగ్రమం వద్ద శనివారం రాత్రి చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈదల నల్లబాబు, రామాం జుల శేషగిరిరావు, వైట్ల అభి, చీపురుపల్లి గణేష్‌, కడియాల శ్రీను పాల్గొన్నారు.

సైకో పోవాలి.. సైకిల్‌ రావాలంటూ మోతమోగించారు

అంబాజీపేట: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో మోతమోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు గణపతి వీరరాఘవులు, నాగాబత్తుల వెంకటసుబ్బారావు, దాసరి వీరవెంకట సత్యనారాయణలు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలనపై విసుగు చెందిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అంబాజీపేట, పుల్లేటికుర్రు, ఇసుకపూడి గ్రామాల్లో శనివారం రాత్రి మోతమోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు దంతులూరి శ్రీనురాజు, గుడాల ఫణి, సర్పంచ్‌ నాగాబత్తుల శాంతకుమారి, నాయకులు పబ్బినీడి రాంబాబు, వక్కలంక బుల్లియ్య, రవణం రాము, దాసరి శ్రీనివాసరావు, పళ్ళ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఆత్రేయపురం: మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లపైకి వచ్చి విజిల్స్‌తో హారన్లుమోగిస్తు సంఘీభావం తెలిపారు. మండల టీడీపీఅధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, క్లస్టర్‌ఇన్‌చార్జ్‌లు ముళ్ళపూడి భాస్కరరావు, కరుటూరి నరసింహరావు, కాయల జగన్నాధం, మెర్ల నాగేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

మామిడికుదురు: మామిడికుదరు సెంటర్‌లో టీడీపీ, జనసేన నాయకులు వివిధ రకాల పరికరాలతో మోత మోగించారు. కంచాలపై శబ్ధం చేస్తు విజిల్స్‌వేస్తూ తమనాయకుడును విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు ఈలి శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ బొంతు భాస్కరరావు, ఉండ్రు శ్రీరామారావు, కంచి విశ్వానాధం, ఇంటి గణపతి, జనసేన నాయకులు రుద్రా శ్రీనివాస్‌, ఇంటి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఉప్పలగుప్తం: టీడీపీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజిల్స్‌, గంటలు, బైక్‌, కారు హారన్‌ల ద్వారా మోత మోగించారు. కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ, భీమనపల్లిలో మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ ఎంపీటీసీ దేశంశెట్టి నాగరత్నకుమారి, ఉప్పలగుప్తంలో చిక్కం కాసు ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిమ్మకాయల చెల్లయ్యనాయుడు, గోపవరంలో మాజీ ఎంపీ ఏజీవీ బుచ్చిమహేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.

రామచంద్రపురం: శనివారం పట్టణంలో పలు ప్రాంతాలలో పళ్లాలపై మోత మోగిస్తూ, గంటలు కొడుతూ, మెయిన్‌రోడ్‌లో వాహనాల హారన్‌లు మోగిస్తూ టీడీపీ నాయకులు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.

ద్రాక్షారామ: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ రామచంద్రపురం మండలంలో శనివారంరాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు విన్నూత్న రీతిలో నిరసన తెలిపారు. నియోజక వర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి చోడవరంలో తమ నివాసం వద్ద ఈల ఊదుతూ నిరసన తెలిపారు. మండలంలో తాళ్లపొలం, వేగాయమ్మపేట, నెలపర్తిపాడు, ఉం డూరుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కంచాలు మోగిస్తూ నిరసన తెలిపారు.

కాట్రేనికోన: చెయ్యేరు అగ్రహారం ఎన్టీ రామారావు విగ్రహం ఎదుట టీడీపీ మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు విజిల్స్‌, గంటలు, పళ్లాలు మోగిస్తూ, కార్‌, బైక్‌ హారన్‌లు మోగిస్తూ మోత మోగించారు. కార్యక్రమంలో నాగిడి నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, చెల్లి సురేష్‌, సూదా బాబూరావు, నంద్యాల వెంకటేశ్వరరావు, విత్తనాల వెంకటరమణ, జొన్నాడ రాజారావు, వెంట్రు సుధీర్‌, గిడ్డి చంటిబాబు, సత్తాల ప్రసాద్‌ పాల్గొన్నారు.

మండపేట: పట్టణంలోని శనివారంరాత్రి చంద్రబాబుకు మద్దత్తుగా ప్రభుత్వం చెవులు మార్మోగేలా కంచాలు విజిల్స్‌ వేయాలంటూ ఇచ్చిన పిలుపు మేరకు శని వారం రాత్రి పట్టణప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కంచాలుకొట్టి మద్దతు ప్రకటించారు.

పి.గన్నవరం: అధిష్టానం పిలుపు మేరకు పి.గన్నవరం మూడు రోడ్ల కూడలిలో టీడీపీ శ్రేణులు ఐదు నిమిషాలు పాటు మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి డొక్కా నాధ్‌బాబు చంద్రబాబు ఈల ఊది కార్యక్రమం ప్రారంభించగా టీడీపీ శ్రేణులు కంచాలు, బైక్‌లుమోత, ఈలలుతో మోత మోగించారు. మండల అధ్యక్షులు తోలేటి సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భూలక్ష్మీ, ఆరుమిల్లి లాల్‌బాబు, కుంపట్ల నాగలక్ష్మి, నేలపూడి దామోదరం, పి.వెంకటేశ్వరరావు, లంకే చిరంజీవి, అవనిగడ్డ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ అంతం.. మా పంతం

రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం

రామచంద్రపురం, సెప్టెంబరు 30: కక్ష పూరితంగా చంద్రబాబు ని అరెస్టు చేయించి జైలుకు పంపించిన వైసీపీ ప్రభుత్వ అంతం మా పంతం అని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆగ్ర హం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంవద్ద 18వ రోజు రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. కాజులూరు మండలం ఆర్యవటం, దుగ్గుదుర్రు, కుయ్యేరు, ఒంటితా డి, గొల్లపాలెం, గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, మాజీ వార్డు మెంబర్‌లు సుమారు 20మంది దీక్షలో పాల్గొన్నారు.

న్యాయవాదుల సంఘీభావం

ముమ్మిడివరం, సెప్టెంబరు 30: శనివారం టీడీపీ లీగల్‌ సెల్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి నందెపు వెంకటేశ్వరరావు, చింతపల్లి అజయ్‌కుమార్‌, గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, అర దాని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణకుమార్‌, నడింపల్లి సుబ్బరాజు, దాట్ల పృధ్వీరాజ్‌, ప్రసాద్‌బాబు, రెడ్డి సత్యనారాయణ, పాల్గొన్నారు.

మండపేట: టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షల్లో టీడీపీ శ్రేణులు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. చెవులో పువ్వు లు, కళ్లకి నల్లటి మాస్క్‌, ఒంటికాలిపై నిలబడి చేతులు దణ్ణం పెడుతూ తమ నిరసన తెలిపారు. ఉదయం దీక్షలను ఎమ్మెల్యే వేగుళ్ల ప్రారంభించారు. ఈదీక్షలను గ్రంఽథాలయ సంస్థ మాజీ చైర్మ న్‌ వీర్రెడ్డి, ఇంద్రిరాణీలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.

కె.గంగవరం: స్కిల్‌ డెవలెప్‌మెంట్‌లో చంద్రబాబు ఏవిధమైన అవినీతికి పాల్పడకపోయినా రాజకీయకక్షతో జగన్‌ప్రభుత్వం అన్యా యంగా అరెస్టు చేసిందని టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ సలాది రమేష్‌ అన్నారు. ఆదివారం ఆయన సత్యవాడ గ్రామంలో చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలను ప్రజలకు వివరించారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌కు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌ బలుసు వీరవెంకట కృష్ణప్రసాద్‌, సలాది సత్తిబాబు పాల్గొన్నారు.

శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు

కొత్తపేట: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూర్తి ఆరోగ్యంతో అక్రమ కేసుల నుంచి బయటపడి విడుదల కావాలని కోరుతూ టీడీపీ శ్రేణులు శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ జడ్పీటీసీ ధర్నాల రామకృష్ణ, మాజీ సర్పంచ్‌లు వీరవెంకట సత్యనారాయణ, వీరాస్వామి, పాల్గొన్నారు.

రాజోలు: రాక్షసపాలనను అంతమొందిండచమే టీడీపీ ధ్యేయ మని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. రాజోలులో జాతీ య టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు కు నిరసనగా మాజీమంత్రి గొల్లపల్లి ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మాజీమంత్రి గొల్లపల్లి, నియోజక వర్గ పరిశీలకుడు చిటికెల రామ్మోహనరావు పాల్గొన్నారు. కార్యక్ర మంలో ముదునూరి చినబాబురాజు, రాజోలు ఎంపీపీ కేతా శ్రీను, మంగెన భూదేవి, చాగంటి స్వామి, ముప్పర్తి నాని, బోళ్ల వెంకట రమణ, అడ బాల యుగంధర్‌, బందెల పద్మ, మట్టపర్తి లక్ష్మి, కడలి సత్య నారాయణ, శిరిగినీడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

కపిలేశ్వరపురం:చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని నిడసనమెట్టలో నందికోళ్ళ కాశీవిశ్వనాధం ఆధ్వర్యం లో నిర్వహించిన మహాశక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.

పి.గన్నవరం: పి.గన్నవరంలో జరిగిన నిరసన దీక్షల్లో పాల్గొన్న టీడీపీ శ్రేణులకు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి డొక్కా నాధ్‌బాబు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో మట్టపర్తి రామకృష్ణ, మద్దాల సుబ్బారావు, ఎన్‌.సునీల్‌రాజు, ఎస్‌.పెద్దిరాజు, తోలేటి సత్తిబాబు, మోల్లేటి శ్రీను, చిట్టూరి శ్రీను, మద్దాల పెద్దకాపు, బొండాడ నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-01T01:28:45+05:30 IST