గోపాలపురంలో ఆరని చిచ్చు
ABN , First Publish Date - 2023-07-17T00:47:12+05:30 IST
గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జిని మార్పు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
ఇద్దరూ కాకుండా మూడో వ్యక్తికే మద్దతిస్తామన్న నేతలు
నియోజకవర్గ కేంద్రంలో నాయకుల ఆత్మీయ సమావేశం
అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ
గోపాలపురం, జూలై 16 : గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జిని మార్పు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. గోపాలపురం కేఎస్.రెడ్డి ఫంక్షన్ హాలులో ఆదివారం రాత్రి టీడీపీ గోపాలపురం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. నియో జకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు తమ అభిప్రా యాలను వెలిబుచ్చారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌ని నియమించడం దారుణ మన్నారు. గత కొన్నేళ్లుగా పార్టీలో పని చేస్తున్న నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నియో జకవర్గ ఇన్‌ఛార్జ్‌ని ప్రకటించాల్సి ఉందని అభి ప్రాయం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జ్ విషయమై పలుమార్లు అధిష్ఠానానికి తెలియజేసిన స్పందిం చలేదన్నారు. దీనిపై ఇప్పటి వరకు నియోజక వర్గ పరిధిలో కప్పలగుంట, గౌరీపట్నం, గోపాల పురం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి సం తకాల సేకరణ చేస్తున్నామన్నారు. ఇప్పటి కైనా అవకాశం ఉందని.. వెంటనే అధిష్ఠానం నిర ్ణయం మార్చు కోవాలన్నారు.సమావేశం అనంత రం సంతకాలు సేకరించిన పత్రాలను అధిష్ఠా నానికి అందజేస్తామ న్నారు. అధిష్టాన నిర్ణయా నికి కట్టుబడి ఉంటారా లేదా అని ఒక విలేఖరు అడిగిన ప్రశ్నకు పలువురు సమాధానం ఇస్తూ ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట రాజు కాకుండా మూడోవ్యక్తిని నియమించినా పని చేస్తామని జవాబిచ్చారు.ఈ కార్యక్రమంలో కొయ్యలమూడి చినబాబు, సుంకర దుర్గారావు, ఇమ్మని సూర్యనారాయణ, చదలవాడ ప్రసాద్, మేణ్ణి సుధాకర్,ముప్పిడి అశోక్, జామి సూర్య చంద్రం, పడమటి శ్రీనివాసరావు,హోతా రాజ బాబు,కొఠారి వెంకటేశ్వరరావు, జ్యేష్ట బుల్లబ్బు లు, గంటా బాబ్జి, కొఠారు గాంధీ, సుంకవల్లి బ్రహ్మయ్య, అల్లాడి రాజారావు, కొయ్యలమూడి నాగార్జున, ఏలేటి సత్యనారాయణ, రావు రమణ, మిడియాల శ్రీను,బలుసు దామోదరరావు, కూచి పూడి భాస్కరరావు,ఈడీ శ్రీను, నాలుగు మం డలాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.