Ayyannapatrudu: ‘సీఎం హోదాలో ఇదే చివరి బర్త్‌డే’.. జగన్‌కు అయ్యన్న బర్త్‌డే విషెస్
ABN , Publish Date - Dec 21 , 2023 | 03:21 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్‌లో విషెస్ తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు కలగాలి. అయితే సీఎం హోదాలో మీకు ఇదే చివరి బర్త్‌డే అవుతుంది.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan reddy) పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు(Former Minister Ayyannapatrudu) ట్విట్టర్‌లో విషెస్ తెలియజేశారు. ‘‘సీఎం వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు కలగాలి. అయితే సీఎం హోదాలో మీకు ఇదే చివరి బర్త్‌డే అవుతుంది. ఎందుకంటే మీరు మూడు నాలుగు నెలల్లో మాజీ సీఎం అవ్వబోతున్నారు. ఈ విషయం మీకూ పూర్తిగా అర్ధం అయినట్లు ఉంది. అందుకే ఒక్కరోజులో మీ పుట్టినరోజు ప్రకటనల పేరుతో సొంత పత్రిక కోసం రూ.100 కోట్లు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల నుంచి కోట్లు కుమ్మరించి శుభాకాంక్షలకు ప్రకటనలా? ప్రైవేటు సంస్థలను బెదిరించి మరీ యాడ్స్ పేరుతో వసూలు చేస్తారా? పుట్టిన రోజు నాడూ అబద్ధాలు చెప్పడమే మీ నైజమా? బర్త్‌డే పేరుతో ఒక్క రోజులో రూ.100 కోట్లు కొట్టేసిన ఏకైక సీఎం మీరే. పుట్టిన రోజును కూడా ఆర్థిక ఉగ్రవాదానికి వేదికగా చేకుంటారు కాబట్టే.. ముఖ్యమంత్రిగా మీకు ఇది చివరి పుట్టిన రోజు అవుతుంది. అక్రమ పద్ధతిలో, అధికారిక దోపిడీలో మీకు మీరే సాటి. రాష్ట్రం మాత్రం లూటీ’’ అంటూ విమర్శలు గుప్పిస్తూ అయ్యన్న ట్వీట్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..